బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తయిపోయింది. రేవంత్ విన్నర్ గా నిలవగా.. శ్రీహాన్ రన్నర్ అయ్యాడు. కానీ విచిత్రంగా మొత్తం డబ్బులో రూ.40 లక్షల సూట్ కేస్ తీసుకుని శ్రీహాన్ బయటకొచ్చేయగా, దీంతో రేవంత్ కు రూ.10 లక్షలు మాత్రమే దక్కింది. ఈ క్రమంలోనే చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గెలిచినోడికి తక్కువ, రన్నర్ కి అంత ఎక్కువ మొత్తం ఎలా ఇచ్చారని అన్నారు. అయితే అందరూ ఎవరికి ఎంత మొత్తం దక్కిందా అని లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ ఓవరాల్ ఎంత అమౌంట్ సొంతం చేసుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం.
ఇక విషయానికొస్తే.. గతంతో పోలిస్తే ‘బిగ్ బాస్ 6’వ సీజన్ చాలా నార్మల్ గా సాగింది. షో ప్రారంభమైనప్పుడు సింగర్ రేవంత్ తప్పించి మిగతావారిలో ఒక్కరు కూడా తెలియదు. అయితే వారాలు గడిచిన కొద్దీ గీతూ, ఇనయా లాంటి కంటెస్టెంట్స్ తమ ఆటతీరుతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వచ్చారు. మరోవైపు రేవంత్.. ప్రతివారం నామినేషన్స్ లో ఉన్నప్పటికీ సేవు అవుతూనే వచ్చాడు. అలా ఫినాలే వరకు వచ్చాడు. విన్నర్ కూడా అయ్యాడు. హోస్ట్ నాగార్జున మాత్రం.. ఓటింగ్ పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచాడని, కానీ శ్రీహాన్ డబ్బులున్న సూట్ కేసు తీసుకున్నాడు కాబట్టి రేవంత్ విన్నర్ అని ప్రకటించారు.
ఇక శ్రీహాన్ సూట్ కేసు తీసుకోవడంతో విన్నర్ గా నిలిచిన రేవంత్ కు రూ.10 లక్షలు డబ్బులు అందాయి. వీటితోపాటే రూ.30 లక్షలు విలువ చేసే 605 గజాల ఫ్లాట్, రూ.10 లక్షలు విలువైన మారుతి సుజికి బ్రెజా కారు కూడా రేవంత్ గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌసులో 15 వారాల పాటు ఉన్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల మేర రేవంత్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే గెలిచినందుకు రూ.50 లక్షలు ప్లస్ హౌసులో ఉన్నందుకు రూ.30 లక్షలు అంటే దాదాపు రూ.80 లక్షలు పైనే రేవంత్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా షోలోని విన్నర్ అయినా సరే రేవంత్ తక్కువే గెలుచుకున్నాడని అనుకున్నవాళ్లు.. ఈ మొత్తం చూసి షాకవుతున్నారు. మరి రేవంత్ విన్నర్ కావడం, రెమ్యూనరేషన్ ఇంత మొత్తం అని వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.