బిగ్ బాస్ 6వ సీజన్.. రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రేక్షకులు కూడా మెల్లమెల్లగా అలవాటుపడుతున్నారు. తొలి వారం హౌసులో గొడవలు, టాస్కులు, హగ్గులు, ముద్దులు.. ఇలా ఫుల్ ఆన్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఇక వీకెండ్ వస్తే చాలు హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. హౌస్ లో ఆ వారం బాగా ఫెర్ఫార్మ్ చేసిన వారిని మెచ్చుకుంటూ.. తప్పు చేసిన వాళ్ల గాలి తీసేస్తాడు. ఈ వారం కూడా దాదాపు అందరూ పార్టిసిపెంట్స్ ని ఓ ఆటాడేసుకున్నాడు. శ్రీహాన్-ఇనయా గొడవపైనా కౌంటర్స్ వేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జస్ట్ రెండు రోజుల ముందు వరస్ట్ ఫెర్ఫామర్ ఎవరో చెప్పమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో చాలామంది హౌస్ మేట్స్ గీతూని టార్గెట్ చేశారు. హౌస్ లో ఆమె చేసే అతిని కారణంగా చెబుతూ నామినేట్ చేశారు. అంతా బానే ఉంది. కానీ ఇదే సమయంలో ఇనయా-శ్రీహాన్ గొడవపడ్డారు. ‘నేను సోలోగా హౌస్ లోకి వచ్చానని, అలానే గేమ్ ఆడుతున్నానని.. నీకు బయట సిరి ఇంకా చాలామంది ఉన్నారు’ అని ఇనయా చెప్పింది. దీంతో శ్రీహాన్ కి కోపం వచ్చి వేలు చూపిస్తూ.. బయటపేర్లు తీయొద్దంటూ ఇనయాకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే ఇనయా తగ్గలేదు. ‘నువ్వు అందరితో సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నావ్’ అని రిటర్న్ కౌంటర్ వేసింది.
ఇప్పుడు శనివారం ఎపిసోడ్ లో ఇదే విషయమై నాగ్ కౌంటర్స్ వేశాడు. బయటవాళ్ల పేర్లు తీస్తే ప్రాబ్లమా అని శ్రీహాన్ ని అడగ్గా.. లేదు సర్ అని అతడు సమాధానమిచ్చాడు. ఎవరో ఒకరి పేరు తీస్తే ఎందుకంత కోపం అని నాగ్ కూల్ గా మాట్లాడాడు. ‘సరైన కారణం ఉన్నప్పుడు పేరు తీస్తే ఓకే కానీ కారణం లేకుండా తీస్తే ఎలా.. నాకు వేరొకరికి గొడవ అవుతున్నప్పుడు మేమిద్దరమే మాట్లాడుకోవాలి గానీ..’ అని శ్రీహాన్ అనగా.. ‘ఇక్కడ ఆడియెన్స్ సపోర్ట్ తప్పితే వేరే సపోర్టే వేస్ట్’ అని నాగ్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘నీకు పెద్ద మనసుందని, క్లాస్ నుంచి మాస్ కి వచ్చావ్ కదా దానికి థంబ్స్ అప్’ అని నాగ్, శ్రీహాన్ ని మెచ్చుకున్నాడు. ‘నీదైనప్పుడు నీ స్థానాన్నిఅస్సలు వదులుకోవద్దు’ అని కూడా శ్రీహాన్ నాగ్ చెప్పాడు. శ్రీహాన్ కి నాగ్ కౌంటర్స్ వేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఈ వారం బిగ్బాస్ ఎలిమేషన్లో ట్విస్ట్.. ఎలిమినేషన్ లేనట్టే!