Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 మొదలై వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే షో రసవత్తరంగా మారింది. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. షోలోని కంటెస్టెంట్లు మరి నిజంగానే గొడవ పడుతున్నారా?.. లేక నటిస్తున్నారా? అన్నది తెలియదు కానీ.. వారి మధ్య గొడవలు చూస్తే మాత్రం అయ్యబాబోయ్ అనిపిస్తోంది. జెంట్స్ మధ్య కంటే లేడీస్ మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయి. మొన్న గీతూ రాయల్, ఇనయా సుల్తానాల మధ్య పెద్ద గొడవ జరిగింది. నేడు మెరీనా, శ్రీ సత్యల మధ్య రోహిత్ సాహ్ని విషయంలో గొడవ జరిగింది. శ్రీ సత్య.. రోహిత్‌ను జాగింగ్‌కు వెళదాం రా అనటంతో ఈ గొడవ మొదలైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మెరీనా, ఆమె భర్త రోహిత్‌లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో శ్రీ సత్య అక్కడికి వచ్చింది. ‘‘ రోహిత్ జాగింగ్‌కు వెళదాం రా’’ అని పిలిచింది. దీంతో మెరీనాకు కోపం వచ్చింది. భర్తతో మాట్లాడుతూ ఉంటే డిస్ట్రబ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీ సత్యతో గొడవకు దిగింది. ‘‘ సత్య వచ్చి మధ్యలో ‘కమ్ విల్ గో ఫర్ ఏ వాక్’ అంటే..తనెవరు చెప్పటానికి మధ్యలో..’’ అని మెరీనా మండిపడింది. దానికి శ్రీ సత్య ‘‘ రా వాకింగ్‌కు వెళదాం అన్నా కూడా తప్పేనా మెరీనా’’ అని ప్రశ్నించింది. ఆ వెంటనే మెరీనా .. ‘‘ఐ వాంట్ మై టైం విత్ మై హస్బండ్’’ అని అంది.
ఆ తర్వాత శ్రీ సత్య ‘‘ ఒకే మీ హస్బండ్ మీతో ఉండకపోతే నేనేం చేయమంటావు’’ అని తిరిగి ప్రశ్నించింది. శ్రీ సత్య మాటలతో మెరీనాకు కోపం మరింత పెరిగిపోయింది. ‘‘ ఉండక పోతేనా’’ అంటూ శ్రీ సత్యతో వాగ్వివాదానికి దిగింది. కొద్దిసేపటి తర్వాత రోహిత్ అక్కడికి వచ్చాడు. భార్యను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయినా మెరీనా ఆగలేదు. అతడినుంచి విడిపించుకుని ముందుకెళ్లింది. ‘‘కపుల్‌గా వచ్చాం.. ఊరికే వచ్చామా’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. మరి, బిగ్‌బాస్ హౌస్‌లో మెరీనా, శ్రీ సత్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sri Satya: శ్రీ సత్య గతం తెలిసి హౌస్ మేట్స్ కన్నీరు! అనవసరంగా నామినేట్ చేశారా?