బిగ్ బాస్ హౌసులో ఈ వారం జరిగిన ఓటింగ్ రోజురోజుకూ మారిపోతూ వచ్చింది. 13 మంది నామినేషన్స్ లో ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే టెన్షన్, డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఒకానొక సందర్భంలో మెరీనా, వాసంతి… ఇద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటకెళ్లిపోతారనే వార్తలొచ్చాయి. కానీ ఇంటిసభ్యులతో పాటు చూస్తున్న ఆడియెన్స్ కి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అసలు ఎవరూ ఊహించని అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ ఏడో వారంలో మరో వికెట్ పడింది. ఈసారి ఏకంగా 13 మంది నామినేట్ అయ్యారు. గీతూ, ఆర్జే సూర్యని మాత్రమే దీని నుంచి తప్పించుకున్నారు. ఇక వీరిలో శ్రీసత్యతో ఎప్పుడూ పులిహోర కలుపుతూ బాగా బిజీగా ఉండే అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చెప్పాలంటే ఈసారి రెండో వారంలా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే హౌసులో ఒక్కరూ కూడా సరిగా గేమ్స్ ఆడటం లేదు. అస్సలు ఎంటర్ టైన్ చేయట్లేదు. ఇదే విషయమై బిగ్ బాస్ కూడా అందరినీ ఆడేసుకున్నాడు.
అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉందని తెలుస్తోంది. అర్జున్ కల్యాణ్ ని డైరెక్ట్ గా ఇంటికి పంపేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు అర్జున్, ఇన్ని వారాలు ఉండటంపైనా నెటిజన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీసత్యని చూస్తూ, ఆమెతో మాట్లాడటం కోసం పరితపించడం తప్పించి ఒక్క గేమ్ కూడా కరెక్ట్ గా ఆడింది లేదని అంటున్నారు. అలానే బిగ్ బాస్ చరిత్రలోనే రెండుసార్లు జైలుకి వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ కూడా అర్జున్ కల్యాణ్ మాత్రమే. ఇలా పలు కారణాలతో పాటు ఓటింగ్ శాతం కూడా తక్కువ రావడంతో అర్జున్ బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది.
Arjun Kalyan is out of the house….#BiggBossTelugu6 #ArjunKalyan pic.twitter.com/FBBOOr6r34
— Vamc Krishna (@lyf_a_zindagi) October 22, 2022