బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తి చేసుకుని ఉత్సాహంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. అంతా మొదటివారం ముగిసే సరికి ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ ఎదురుచూశారు. నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా.. మొదటి వారం బయటకు వచ్చేది ఎవరా అని ఉత్కంఠగా వెయిట్ చేశారు. చివరికి ఇది నో ఎలిమినేషన్ వీక్ అంటూ నాగార్జున షాకిచ్చారు. హౌస్‌లోని సభ్యులు అంతా సంబరాలు చేసుకున్నా.. ప్రేక్షకులు మాత్రం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈమాత్రం దానికి ఓటింగ్, మిస్డ్ కాల్స్ దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. అందరి అంచనాల ప్రకారమే.. చివరికి ఇనయా- అభినయశ్రీ వచ్చారు. ఆఖర్లో వాళ్లిద్దరినీ సేవ్ చేశారు.
గార్డెన్‌లో రెండు సుత్తులు ఉన్నాయి. ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్లు సేవ్ అవుతారు. లిఫ్ట్ చేయని వాళ్లు ఎలిమినేట్ అంటూ నాగార్జున్ ఫుల్ సీరియస్ గా చెప్పి, గుడ్ బై చెప్పుకుని వెళ్లండి మళ్లీ రారేమో అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. చివరికి ఇద్దర్నీ సేవ్ చేసి ఇంట్లోకి పంపాడు. ఇనయా కంటే ఎలిమినేషన్ విషయంలో అభినయశ్రీ ఎంతో భయపడినట్లుగా కనపించింది. సేవ్ కాగానే ఆదిత్య అంటూ కేకలు వేస్తూ ఇంట్లోకి పరుగెత్తుకెళ్లింది. వెళ్లగానే ఆదిత్యను పట్టుకుని ఎగిరి సంకెక్కేసింది. అయితే ఆదిత్య కూడా ఈ సెలబ్రేషన్‌ని ఊహించలేదు. ఆదిత్య కూడా అభినయశ్రీ సేవ్ కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ వీక్ నామినేషన్స్ విషయంలో మళ్లీ రచ్చ మొదలైంది. ఈ వీక్ మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నామినేషన్స్ పరంగానూ పెద్ద రచ్చే జరిగింది. రెండోవారం నామినేషన్స్ లో గలాటా గీతూ, అభినయశ్రీ, మరీనా-రోహిత్(ఒక కంటెస్టెంట్ కిందే కౌంట్), షానీ సాల్మన్, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, రేవంత్‌లు ఉన్నట్లు సమాచారం. ఈసారి నామినేషన్స్ లో ఆదిరెడ్డి- ఆరోహీలకు గొడవ జరిగింది. నామినేషన్ రీజన్ విషయంలో వారి మధ్య గొడవ షురూ అయ్యింది. అయితే ఈవారం ఎవరు లీస్ట్ లో ఉంటారు? ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు? అనే ప్రశ్నలు ఇప్పటి నుంచే జోరందుకున్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.