బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ఎంటర్ అయిపోయింది. మొదటి వారం మొత్తం ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అందుకోసం వారిలో వారు ఎన్నో గొడవలు, తగాదాలు పడి మరీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు రెండో వారం అంతకంటే మరింత ఉత్సాహ బరితంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటి వారం నుంచి కూడా డిఫరెంట్ టాస్కులు, కొత్త స్కీములతో ఇంట్లోని సభ్యుల మధ్య గ్రూపులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని కొత్త టాస్కులు వస్తాయని, గొడవలు కూడా గట్టిగానే అవుతాయని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొదటివారం ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకులు బిగ్ బాస్‌పై గుర్రుగా ఉన్నారు. నిజానికి మొదటివారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ఉత్కంఠగా సాగింది. శ్రీసత్య నుంచి ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివరకి ఇనయా, అభినయ శ్రీ మాత్రమే మిగిలారు. వాళ్లిద్దరిని గార్డెన్‌లోకి వెళ్లమని చెప్పారు. ఇప్పుడే గుడ్ బై చెప్పుకోండి మళ్లీ మీరు వెనక్కి రారు అంటూ నాగార్జున డైలాగ్ చెప్పడంతో అంతా వాటేసుకుని ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత అభినయ శ్రీ, ఇనయా సుల్తానా గార్డెన్ లోకి వెళ్లారు. అక్కడ రెండు సుత్తులను పెట్టారు. వాటిలో ఎవరు సుత్తిని ఎత్తగలిగితే వాళ్లు సేవ్ అయినట్లు ఎత్తలేని వాళ్లు ఎలిమినేట్ అని చెప్పారు. తీరా చూస్తే ఇద్దరూ సుత్తులను ఎత్తేశారు. అంటే ఇద్దరూ సేవ్ అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఈ వారం నో ఎలిమినేషన్ వీక్‌గా ప్రకటిస్తున్నాం. మీ ఇద్దరూ సేవ్ అయ్యారు అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆ తర్వాత హౌస్‌లోని సభ్యులు అందరూ ఎంతో ఆనందంతో గంతులు వేశారు. ఇంకా ఎవరు సెటిల్ కాలేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే టైమ్ లేదు అందుకే ఈ వీక్ నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పాడు. అయితే చివర్లో ఈ ట్విస్ట్ చూసిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ లేనప్పుడు మరెందుకు ఓటింగ్ పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. రోజూ మిస్డ్ కాల్ ఇవ్వడం, హాట్ స్టార్ లో ఓటేయడం ఎందుకు? మేం మరీ అంత వె*వల్లా కనిపిస్తున్నామా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? అంటూ స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. నో ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by ABINAYA (@abinaya_satishkumar) View this post on Instagram A post shared by ABINAYA (@abinaya_satishkumar)