‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో మాములుగా రచ్చ జరగడం లేదు. టాస్కుల మీద టాస్కులతో ఇంట్లోని సభ్యులు గెలుపు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో అయితే కొట్టేసుకోవడమే మిగిలి ఉంది. అది కూడా జరుగుతుంది. రవి, లోబో, యానీ మాస్టర్‌లకు వచ్చిన కొత్త పవర్‌తో అది కూడచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతం యానీ మాస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. శ్వేత- యానీ మాస్టర్ ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ టాస్కులో భాగంగా ఇద్దరి మధ్య నిప్పు రాజుకుంది. అది ఎంత దూరం పోయి ఆగుతుందో చూడాలి.
ఇదీ చదవండి: విడాకుల బాధను సమంత ఎలా అధిగమిస్తోందో తెలుసా?
కెప్టెన్సీ పోటీదారుల టాస్కు కోసం ఇంట్లోని సభ్యులకు బొమ్మల తయారీ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. అందుకోసం సభ్యులను 4 టీమ్లుగా చేశాడు. కాజల్, సిరి సంచాలకులుగా ఉన్నారు. బొమ్మల తయారీ విషంలో అప్పటికే సిరితో యానీ మాసట్ర్‌కు గొడవ జరిగింది. ‘నాకు డ్రామాలు ఆడటం రాదు. నేను ఏదున్నా ఫేస్ మీద చెప్తాను అని’ యానీ మాస్టర్ చెప్పింది. తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన సూపర్ పవర్‌తో ఇప్పుడు కథ అంతా మారిపోయింది. ఏదొక టీమ్ నుంచి బొమ్మలు తీసుకోవచ్చు అని చెప్పగానే.. అందరూ షణ్ముఖ్ టీమ్ నుంచి తీసుకుంటుంది అనుకున్నారు. కానీ, అందరికీ షాకిస్తూ యానీమాస్టర్ శ్వేత దగ్గర బొమ్మల కోసం వెళ్లింది. అప్పటికే అందరూ షాకయ్యారు. ఏంటి ఇలా చేస్తున్నారు అని. ఆ లాక్కొనే క్రమంలో వారిద్దరూ ఫిజికల్‌గా లాక్కున్నారు. ఆ విషయంలో శ్వేత చాలా హర్ట్ అయినట్లు కనపడింది. ఆ కోపంలో శ్వేత రెస్పాన్స్ చూసి యానీ మాస్టర్ కూడా కోపడ్డింది. ‘ఈ తొక్కలో రిలేషన్స్ నాకొద్దూ అంటూ స్టేట్‌మెంట్’ పాస్ చేసింది. హమీదా ఎలిమినేట్ అయినప్పటి నుంచి యానీ మాస్టర్ కాస్త లోగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కామెంట్‌లో అది కూడా ప్రస్తావించారు. మొన్న ఫ్రెండ్ పోయింది. ఇప్పుడు బిడ్డ పోయింది.. ఈ తొక్కలో రిలేషన్స్ వద్దు అంటూ.
బిగ్ బాస్ అలా స్పెషల్ పవర్ ఇవ్వడాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.