శ్వేత మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్వేత తల్లి మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
వైజాగ్ శ్వేత మరణానికి గల కారణం ఇంకా మిస్టరీగానే మిగిలింది. పోస్టుమార్టం రిపోర్టు, శ్వేత సెల్‌ఫోన్ ఈ కేసులో కీలకంగా మారాయి. పోలీసులు ఇప్పటికే మృతురాలి భర్త మణికంఠతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్వేత మృతిలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత తల్లి మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మణికంఠ చెల్లెలి భర్త తన కూతుర్ని లైంగికంగా ఇబ్బంది పెట్టాడని ఆరోపిస్తోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పెళ్లయిన నెల రోజులు శ్వేతను బాగా చూసుకున్నారు. తర్వాతి నుంచి ఆ ఇంట్లోని చిన్నపిల్లలు కూడా వేధించటం మొదలుపెట్టారు.
మొగుడు ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు. నాకు నా వాళ్లే ముఖ్యం అనేవాడు. మధ్యలో వచ్చిన దానివి నువ్వెవరు అనే వాడు. నా కూతురి పెద్ద ఆడపు వాళ్ల ఆయన నా కూతురిపై చెయ్యి వేశాడు. నా కూతురు వరలక్ష్మి వ్రతం చేస్తోందట. పేరంటాలకు బొట్లు అవి పెట్టిన తర్వాత శ్వేత తలుపు దగ్గర నిల్చుందంట. బయటకు వెళ్లటానికి చాలా స్థలం ఉందట. అయినా అతడు శ్వేత వీపు, బ్యాక్ మీద టచ్ చేశాడట’’ అని చెప్పింది. తన కూతురు ఫోన్లో తనకు చెప్పిన విషయాలను మీడియా ముందు వెల్లడించింది.
కాగా, శ్వేత మంగళవారం భర్తతో గొడవపడి ఇంటినుంచి బయటకు వెళ్లింది. ఇక, అప్పటినుంచి కనిపించకుండాపోయింది. అత్తింటి వారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి బీచులో శ్వేత శవం దొరికింది. పోలీసులు ఈ సమాచారాన్ని శ్వేత అత్తింటి వారికి అందించారు. అయితే, అత్తింటి వారే తన కూతుర్ని చంపేశారని శ్వేత తల్లి ఆరోపిస్తోంది. మరి, శ్వేత మరణం మిస్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.