శ్వేత మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్టు.. సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శ్వేత ఇంటితో పాటు చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
వైజాగ్ శ్వేత మృతిపై సందిగ్థత వీడటం లేదు. ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అన్నదిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. పోస్టుమార్టం రిపోర్టుతో ఆమె మరణంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు రిపోర్టును పోలీసులకు అందజేశారు. పోలీసులకు ఇప్పటికే ఆమె మరణం గురించి క్లారిటీ వచ్చి ఉంటుంది. పోలీసు ఆ పోస్టుమార్టం వివరాలను ఇంకా బయటకు వెల్లడించలేదు. ఆ వివరాల కోసం మీడియాతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్వేత కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు శ్వేత ఇంటితో పాటు ఆ చుట్టు ప్రక్కల ఉన్న సీసీటీవీ ఫొటేజీలను పరిశీలించారు.
శ్వేత ఎప్పుడు బయటకు వెళ్లింది? అన్న దానిపై ఆరాతీశారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఇంట్లో అందరూ ఉన్నారు. కాసేపటి తర్వాత అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు శ్వేత రూమ్ లాక్ చేసి ఉంది. ఆ తర్వాత కొద్దిసేపు ఓ సీసీ కెమెరా ఆఫ్ చేసి ఉంది. ఓ మూడు నిమిషాల పాటు వీడియో జంప్ అయింది. దీంతో ఆ వీడియోలో శ్వేత కదలికలు కనిపించలేదు. రాత్రి సమయంలో శ్వేత అత్తామామలు శ్వేత కోసం వెతికారు. బయటకు వచ్చి వెతకటం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మూడు నిమిషాలు వీడియో జంప్ అవ్వటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెటిజన్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహాగానాలు మొదలెట్టారు. అత్తింటి వారే శ్వేతను ఏదైనా చేసి.. బయట పడేయటానికి సీసీటీవీ ఫుటేజీలను ఆపేసి ఉంటారని భావిస్తున్నారు. బయట రోడ్లపై… బీచ్‌కు వెళ్లే మార్గాల్లోని సీసీటీవీల్లో ఎక్కడా శ్వేత కనిపించకపోతే అత్తింటి వారే కారణం అవుతారని అంటున్నారు. ఏది ఏమైనప్పటి పోస్టుమార్టం రిపోర్టు వివరాలు బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆమె చావుకు కారణం తెలిస్తే.. మిగిలిన విషయాలపై ఓ అంచనాకు రావచ్చు. మరి, శ్వేత ఇంటి సీసీటీవీ ఫుటేజీలు ఓ మూడు నిమిషాల పాటు ఎందుకు ఆగాయని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.