శ్వేత మృతిలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత తల్లి చెబుతున్న దాని ప్రకారం.. మణికంఠ చెల్లెలి భర్త శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
వైజాగ్ గృహిణి శ్వేత మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి అత్తింటివారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేత ఆడపడచు భర్త తన కూతుర్ని లైంగికంగా వేధించాడని శ్వేత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లైంగిక వేధింపుల కోణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ లైంగిక వేధింపుల కోణమే శ్వేత మృతికి కారణం అయ్యిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. శ్వేత తల్లి చెబుతున్న దాని ప్రకారం… మణికంఠ చెల్లెలి భర్త శ్వేతను లైంగికంగా వేధించేవాడు. ఈ విషయం మణికంఠతో పాటు ఇతర కుటుంబసభ్యులకు కూడా తెలుసు. అయితే, ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు.
మణికంఠ కూడా దానిపై తన బావను ఒక్క మాట కూడా అనలేదు. దీంతో అతడు రెచ్చిపోయాడు. పలుసార్లు శ్వేతను వేధించాడు. అప్పటికి కూడా మణికంఠ పట్టించుకోలేదు. చెల్లిలి భర్త కావటంతో సమస్యను పెద్దది చేస్తే ఆమెకు ఇబ్బంది అవుతుందని భావించాడు. కట్టుకున్న భార్య కంటే చెల్లెలికి, ఆమె భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తనను ఇంట్లో మనిషిగా కూడా చూడకపోవటంతో శ్వేత మనసు ముక్కలైంది. ఇదే విషయమై భర్తతో తరచుగా గొడవపడేది. శ్వేత గర్భం దాల్చిన తర్వాత కూడా మణికంఠ ఇదే తీరుగా వ్యవహరించటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయింది.
శ్వేత తల్లి చెబుతున్న దాని ప్రకారం.. శ్వేతపై తన చెల్లిలి భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని మణికంఠకు తెలుసు. అయినా అతడు పట్టించుకోలేదు. శ్వేత కంటే చెల్లెలి భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ విషయంపై గొడవ చేస్తే చెల్లిలి కుటుంబం నాశనం అవుతుందని.. పరువు రచ్చకు వెళుతుందని భయపడ్డాడు. అందుకే శ్వేతపై జరుగుతున్న వేధింపులపై మాట్లాడలేకపోయాడు. ఒకరకంగా మణికంఠ తన భయం కారణంగానే శ్వేతను చంపేసుకున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
శ్వేత తల్లి చెబుతున్న దానికి శ్వేత సూసైడ్ నోట్‌లో రాసిన దానికి ఎక్కడా పొంతన లేదు. మణికంఠ చెల్లెలి భర్త తన కూతుర్ని వేధించాడని శ్వేత తల్లి చెబుతోంది. మరి అంతలా వేధింపులకు గురైన శ్వేత ఆ విషయాన్ని ఎందుకు సూసైడ్ నోట్‌లో పేర్కొనలేదు. ఆ లెటర్‌లో.. ‘నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. బికాజ్ నువ్వు బయటకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్’ అని మాత్రమే ఉంది. ఎక్కడా లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించలేదు. అంటే శ్వేతకు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సూసైడ్ లెటర్‌లో ప్రస్తావించటం ఇష్టం లేకపోయిందా? ఏదైనా కారణం ఉందా? అన్నవి సమాధానాలు లేని ప్రశ్నలే..