తెలుగు బుల్లితెరపై వినోదాన్ని పంచుతూ దూసుకెళ్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ప్రారంభమై నేటికి ఐదు రోజులు ఘనంగా పూర్తి చేసుకుంది. అయితే గొడవలు, అల్లర్లతో వేడిని రాజేస్తున్న ఈ షోతో ప్రేక్షకులు అనుకున్న వినోదాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రతీ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ కంటెస్టెంట్ ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు రానున్నారని మాత్రం ప్రేక్షకుల్లో తెగ చర్చ నడుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం జబర్దస్త్ యాంకర్ వర్షిణి, లేక వర్ష రావచ్చని వార్తలు జోరందుకుంటున్నాయి. కంటెస్టెంట్ లీస్టుల ప్రచారంలో భాగంగా అప్పట్లో యాంకర్ వర్షిణి పేరు జోరుగా వినిపించింది. ఇక వర్షిణి తప్పా అనుకున్న కంటెస్టెంట్లు అందరూ హౌస్ లోకి వెళ్లారు. దీంతో ప్రచార లీస్టులో ఉన్నవారిలో వర్షిణి మాత్రం వెళ్లలేదు. ఇక యాంకర్ వర్షిణి వెళ్లకపోవటంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.