తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. జట్టు ఓటములకు యాంకర్ వర్షిణియే కారణమని ఆరోపిస్తున్నారు. రాబోవు మ్యాచులకు హాజరు కావొద్దని హెచ్చరిస్తున్నారు. అలా కాదని మరోసారి స్టేడియంలో కనిపిస్తే నీ అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు.
‘10 మ్యాచులు, 4 విజయాలు, 6 అపజయాలు..‘ ఇందులో ఒకటి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఆఖరి బంతికి విజయం. ఆదివారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ నోబాల్ వేయడంతో గెలిచాం కానీ లేదంటే అపజయాల సంఖ్య 6కు చేరేది. పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు స్థానానికి చేరేవాళ్లము. ఇదీ ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు. దీనంతటికి కారణం ఆటగాళ్లు సరిగా రాణించకపోవడమన్నది అందరికీ తెలుసు. కోట్లు కుమ్మరించినా జట్టుకు విజయాన్ని అందించాలనే లక్ష్యాన్నే మరుస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో లాజిక్ తెరమీదకు వస్తోంది. సన్‌రైజర్స్ ఓటమికి యాంకర్ వర్షిణియే కారణమని ఆభిమానులు చెప్తున్నారు.
అభిమానులను తన అందంతో కట్టిపడేయానికి యాంకర్ వర్షిణి హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ ఆడుతోన్న అన్ని మ్యాచులకు హాజరవుతోంది. ఇది అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 పర్యాయాలు) సన్‌రైజర్స్ ఓటమిపాలు కావడంతో అభిమానులు పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే తెలుగు అభిమానులు.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే నీ అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు. మరికొందరైతే.. ‘సన్‌రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు.. నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే..’ అంటూ ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి.. ‘అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రామాకే.. కావాలంటే నీకు సన్మానం చేస్తాం..’ అంటూ బ్రతిమలాడుతున్నారు.
Papam varshini ni unanimous ga tidtunnaru SRH fans daridram ani 🤣🙏 pic.twitter.com/KuUnml71a4
— I.P.S🏌️ (@Plant_Warrior) May 5, 2023
ఒకరకంగా చెప్పాలంటే.. వర్షిణీపై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు యుద్ధాన్ని మొదలుపెట్టారని చెప్పవచ్చు. కాగా, వర్షిణి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడిన మూడు మ్యాచులకు హాజరైంది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్‌తో జరిగిన మ్యాచులను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ మూడు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. పోనీ మ్యాచ్ చూశామా..? పోయామా..? అన్నట్లు తిన్నగా ఉంటే సరిపోయేది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. లీగ్ మ్యాచుల్లో ఎస్ఆర్‌హెచ్ మరో నాలుగు ఆడాల్సివుండగా, అన్నింటా విజయం సాధిస్తే, ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించవచ్చు. ఎస్ఆర్‌హెచ్ ఓటములకు వర్షిణిని నిందించటం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.