‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది. ఇంట్లో శ్రీరామ్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇంకొక సభ్యుడి ఎలిమినేషన్ తర్వాత టాప్-5 ఎవరో క్లారిటీ వస్తుంది. అయితే అంతకన్నా ముందే బిగ్ బాస్ మీమీ స్థానాలను ఎంచుకోండని ఒక టాస్క్ ఇచ్చాడు. అందుకోసం గంటలు చర్చించి ఇంట్లోని సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో సన్నీకి టాప్ ప్లేస్ కట్టబెట్టారు. అయితే అసలు సన్నీకి ఆ ప్లేస్ ఎందుకు ఇచ్చారు. అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం.
సన్నీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. ఏదున్నా కూడా అతను ముక్కుసూటిగా చెప్పేస్తాడు. తప్పు తనదైతే నిర్మెహమాటంగా వెళ్లి క్షమాపణ అడగటం చాలా సందర్భాల్లో చూశాం. క్షణికావేశంలో ఏదైనా మాటలు అన్నా కూడా ఆ తర్వాత వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఇప్పటి దాకా ప్రేక్షకులు కూడా గమనించిన విషయాలు. అందుకే ఈ సీజన్ లో ఏ కంటెస్టెంట్ కు లేని విధంగా సన్నీకి సపోర్ట్ పెరిగిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు కూడా సన్నీకి తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే ఇంట్లోని సభ్యులు కూడా అదే నిర్ణయానికి రావడం ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.
ఎందుకంటే సన్నీ ఎప్పుడూ అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఎదుటి వాడికి సహాయం చేయకపోయినా వాడి పతనానికి కారణం కాకూడదు అనే మెంటాలిటీ కలవాడు. తప్పు చేసింది ఫ్రెండ్ అయినా కూడా ఎదిరించడం చూశాం. శ్రీరారమచంద్రతో ప్రతి టాస్కు విషయంలో, ప్రతి నామినేషన్ విషయంలో వివాదాలు ఉన్నా కూడా.. అతని కోసం టాస్కు ఆడి అతడ్ని గెలిపించాడు. శ్రీరామచంద్ర టికెట్ టూ ఫినాలే అందుకున్నాడంటే అందులో సన్నీ పాత్ర కూడా ఉంది.
కాజల్ ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆమె తప్పుగా మాట్లాడితే గట్టిగా ఖండించడం చూశాం. అదే సన్నీలో ఇంట్లోని సభ్యులను కూడా మెప్పించిన అంశాలు. ఓట్ల విషయంలోనూ సన్నీకి బాగా సపోర్ట్ పెరిగింది. చాలా మంది సన్నీ ఈసారి టైటిల్ విన్నర్ అవుతాడని చెప్పుకుంటున్నారు. టైటిల్ విన్నర్ కాకపోయినా రన్నరప్ అయినా అవుతాడని మరికొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా సన్నీ ఫ్యాన్ బేస్ రెట్టింపైందనేది గట్టిగా చెప్పవచ్చు. సన్నీ టైటిల్ విన్నర్ కాగలడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.