బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందులో అనేక మంది కంటెస్టెంట్లు పాల్గొని మంచి గుర్తింపు సంపాందించారు. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల తో కొన్ని ప్రోగ్రామ్ వస్తున్నాయి.ఈ షోల్లో బిగ్ బాస్ సీజన్లలో పాల్లొన్న కంటెస్టెట్లు తమ కామెడీ తో, డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఇలా ఇది వరకే కొన్ని కార్యక్రమాలు వచ్చి సందడి చేశాయి. తాజాగా బిగ్ బాస్ బాటిల్ అంటూ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనే షో సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో సన్నీ, యాంకర్ రవిల మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఒకరిని ఒకరు తోసుకునే స్థాయికి వారిద్దరి గొడవ వెళ్లింది. ఈక్రమంలో సన్నీ అయితే రవిపై ఓ రేంజ్ లో పైర్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోనే గొడవలు అవుతూ ఉంటాయి. అయితే తాజా కార్యక్రమంలోను గొడవలు జరిగాయి. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కార్యక్రమాన్ని యాంకర్ రవి హోస్ట్ వ్యవహరించాడు. ఈ షోలో బిగ్ బాస్ భామల హంగామా మామూలుగా లేదు. సిరి, భానుశ్రీ, అరియానా దివి మొదలైన వారు.. తమ అందచందాలను ప్రదర్శించారు. కింగ్స్ కి క్వీన్స్ కి మధ్య అనేక గేమ్స్ కండెక్ట్ చేశారు. ఈక్రమంలోనే సన్నీ.. హోస్ట్ గా ఉన్న రవిని పిలిచి.. నువ్వు వాళ్లకే సపోర్ట్ చేస్తున్నావ్ అని రవిపై ఆగ్రహించాడు. చిన్నగా మొదలైన గొడవ చివరికి పెద్దదిగా మారింది. మొదటి సన్నీ రవి టచ్ చేయడంతో.. ఏంట్రా తోస్తున్నావు అంటూ రవి రెచ్చిపోయాడు.
నువ్వు ఇక్కడే కాదు బయట కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నావు అని రవిని సన్నీ అంటాడు. దీంతో బయట కాదు నువ్వు ఇక్కడ మాట్లాడు.. దమ్ముంటే అంటూ రవి సీరియస్ అవుతుంటాడు. ఇక సన్నీ.. రవి మీది మీదికి పోతూ తూ.. అనేశాడు. మిగిలిన వాళ్లు వచ్చి వారిద్దరి ఆపారు. అయితే ఇందంతా టీఆర్పీ స్టంట్ అనే కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా విడుదైలన ఈ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షో ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. క్రికెట్ ఆడుతూ నటుడు మృతి!
ఇదీ చదవండి: Sri Reddy: పెళ్లి కాకుండానే గర్భం.. తీయించుకోలేని పరిస్థితి..! శ్రీరెడ్డి ఎమోషనల్!