శ్రీరెడ్డి.. ఒకప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్నీ వదిలేసి తమిళనాడు వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ తెలుగు, తమిళ్‌లో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసింది. వాటిలో తనదైనశైలిలో వంటలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. వంటలతో పాటు అప్పుడప్పుడు జీవితం, గుణపాఠాలు అనే కాన్సెప్ట్ ని కూడా టచ్ చేస్తూ ఉంటుంది. అలా తాజా వీడియోలో ప్రేమ పెళ్లి గొప్పదా? పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా? అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది. ఒకప్పుడు శ్రీరెడ్డి ఏ పోస్ట్ పెట్టినా పనిగట్టుకొని తిట్టేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆమె వీడియోలకు లైకులు, కామెంట్స్ రావడమే కాదు.. వైరల్ కూడా అవుతున్నాయి. అలా తాజాగా బోటీ కూర వండుతూ ప్రేమ- పెళ్లి-అవకాశం-మోజుపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్వీయ అనుభవం కొంత, సమాజంలో చూసినవి కొన్ని కలిపి ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “గతంలో ప్రేమ వివాహంలో నిజంగానే ప్రేమ ఉండేది. ఇప్పుడు ప్రేమ వివాహాల్లో దానికోసం ఎక్సెపెక్ట్ చేసేవాళ్లు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత ఎట్రాక్షన్ పోయాక వారికి వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్రేమ వివాహాలను నేను ప్రిఫర్ చేయను. కొన్నిరోజులు మోజు తీరాక వదిలేస్తున్నారు. మనం తనే తిండి వల్లనో, మనం ఎమోషనల్ గా వీక్ అవ్వడమో లేదా తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్లో తెలీదు. మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి”. “నేను హైదరాబాద్ లో ఓస్టోరీ చూశాను. ఓ అమ్మాయి సింగిల్ పేరెంట్ అంట.. ఆ అమ్మాయి పెళ్లికాకముందే గర్భవతి అయ్యింది. తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అది తీయించుకునే వీలు కూడా లేకుండా చేశాడు. తీసేస్తే అమ్మాయి ప్రాణానికి హాని కలుగుతుందని చెబితే ఉంచేసుకుంది. తల్లిదండ్రులు ఆమెను గెంటేశారు. ఆమె పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది.” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “ఈరోజు ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటుందేమో.. కానీ, ఆ అమ్మాయి జీవితాంతం ఆ మచ్చ మోయాల్సిందే. నాలాంటి వాళ్లు కొంతమంది ఇలాంటి మచ్చలు జీవితాంతం మోస్తూనే ఉండాలి. ఆ అబ్బాయి సారీ నేను కోవర్ట్ నని ఒప్పేసుకున్నాడు. ఈ పాపం నాకు కొడుతుంది కానీ, నేను ఏం చేయలేనంటూ వెళ్లిపోయాడు. అందరూ కాదు కానీ, కొందరు ఇలాగే ఉన్నారు. అందుకే నేను ప్రేమ వివాహాలకు వ్యతిరేకం. అందుకే మీకు నచ్చేవాడు వచ్చే వరకు మీ పేరెంట్స్ నే వెతకనివ్వండి. మీ కాళ్లపై మీరు నిలబడండి. అప్పుడు మీకు ఇచ్చే గౌరవం వేరేలా ఉంటుంది” అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి విషయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: అయ్య.. తాత అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ కు బండ్ల గణేశ్ కౌంటర్! ఇదీ చదవండి: నాలుగో భర్తతో హనీమూన్ లో స్టార్ సింగర్.. ఫోటోలు వైరల్!