బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అని హోస్ట్ నాగార్జున చెప్తున్నప్పుడు కొంత మంది నవ్వుకోవచ్చు. కానీ, ఈ లెక్కలు చూస్తే అవును కదా అని మీరే అనుకుంటారు. తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. ఇప్పుటి వరకు బిగ్ బాస్ లాంఛ్ డే రోజున్న టీఆర్పీ లెక్కలు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగిన మొదటి సీజన్ లాంఛ్ డే రోజు టీఆర్పీ 16.18గా నమోదైంది. రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించినప్పుడు లాంఛ్ డే టీఆర్పీ 15.05, హోస్ట్‌గా నాగార్జున ఎంట్రీ ఇచ్చిన మూడో సీజన్‌లో 17.92 టీఆర్పీ నమోదైంది.
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ అన్నిటికంటే హైఎస్ట్ 18.5 టీఆర్‌పీ వచ్చింది. ఇప్పటివరకు అదే హైఎస్ట్ టీఆర్పీ. తాజా సీజన్‌కు కూడా ఎస్డీ, హెచ్‌డీ కలిపి 18 టీఆర్పీ వచ్చింది. ఈ సందర్భంగా స్టార్ మా మరో ఘనత కూడా సాధించింది. మార్కెట్‌లోనే ఎవ్వరూ సాధించని జీఆర్పీని నమోదు చేసింది. బిగ్ బాస్ లాంఛ్ డే సందర్భంగా స్టార్ మా 1303 జీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ అంశాన్ని కింగ్ నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘ఐదు రెట్లు రెట్టించిన ప్రేమను పంచుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు బిగ్ బాస్ 5 లాంఛ్ డేతో స్టార్ మాని తిరుగులేని నంబర్ వన్ స్థానానికి చేర్చారు’ అంటూ నాగార్జున తెలియజేశారు. ఈ లెక్కలు చూసిన ప్రేక్షకులు, సోషల్ మీడియాలో అందరూ బిగ్ బాస్ రేంజే వేరప్ప అంటూ అనుకుంటున్నారు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.
Thank you all for 5 much Love!!!❤️❤️❤️❤️❤️. You made Starmaa the unbeatable No 1 with BiggBoss Season 5 launch. #BiggBossTelugu5 @starmaa pic.twitter.com/x0iPYwCoUH
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2021