బుల్లితెరపై వస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకొని పదవ వారం నడుస్తోంది. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంటి సభ్యుల మద్య వాడీ వేడిగా పోటీ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. నచ్చని సభ్యుల మీద కంటెస్టెంట్స్ ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పాడు. ఒకవేళ మెజారిటీ కంటెస్టెంట్స్ ఒప్పుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్ నిలబడదు అని తెలిపాడు. ఈ గేమ్ లో చివరికి సన్నీ గిల్టీగా నామినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ 5 లో కంటిస్టెంట్ గా ఉన్న సింగర్ శ్రీరామ్ కి బయట నుంచి మద్దతు పెరిగిపోతుంది. చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సింగర్ శ్రీరామచంద్రకు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పాయల్ రాజ్ పూత్, ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మొన్న నటుడు సోనూ సూద్ తన సపోర్ట్ శ్రీరామ్ కి అన్నారు.
తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక వీడియో ద్వారా ‘బిగ్‌బాస్ హౌజ్‌లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామ్ చంద్ర ఫాలోవర్స్ అండ్ టీం అతడిగా మద్దుతుగా నిలిచినందుకు సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. తాజాగా సజ్జనార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Honoured to receive blessings from IPS VC Sajjanar Sir. He created history nobody can forget! Thank you so much
Real Superhero!!
.
.
. #TeamSreeramaChandra #Sreeram #SreeramaChandra #SRC #biggboss5telugu #biggbosstelugu5 #GameChanger pic.twitter.com/hHyug07Nf2— Sreerama Chandra (@Sreeram_singer) November 13, 2021