తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులే కాక.. నట వారసురాళ్లుగా కూడా తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలా తండ్రికి తగ్గ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ. మోహన్ బాబు నటవారసురాలిగా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మీ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందింది. తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్నంతగా ఆడలేదు. ఈ క్రమంలోనే వెండితెరతో పాటుగా బుల్లితెరపై కూడా షోస్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహిరిస్తున్న ‘చెఫ్ మంత్రా’ సీజన్ 1 విజయవంతం కావడంతో.. చెఫ్ మంత్రా సీజన్ 2తో మన ముందుకు వచ్చారు మంచు లక్ష్మీ. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ఇది టెలీకాస్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఎపీసోడ్ 7 కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపీసోడ్ కు గెస్ట్ లుగా ప్రముఖ సింగర్ శ్రీరామ్ చంద్ర, నటి రాశీ సింగ్ హాజరై సందడి చేశారు.
మంచు లక్ష్మీ.. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది. తాజాగా చెఫ్ మంత్రా-2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే చెఫ్ మంత్రా2 ఎపీసోడ్ 7 కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ఎపీసోడ్ కు సింగర్ శ్రీరామ్ చంద్ర, నటి రాశీ సింగ్ లు గెస్టు లుగా హాజరై సందడిచేశారు. వీరిద్ద జంటగా కలిసి ‘పాపం పసివాడు’ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇది త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. చెఫ్ మంత్రాకు వచ్చిన వీరిద్దరితో మంచు లక్ష్మీ తనదైన శైలిలో ఆడుకుంది. వారితో రకరకాల వంటకాలను చేయించింది. సరదా సరదాగా సాగిన ఈ ఎపీసోడ్ నవంబర్ 11 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. ఈ ప్రోమోలో శ్రీరామ్ చంద్ర మరో సారి తన గొంతుతో ప్రేక్షకులను మైమరపించాడు.