శేఖర్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయాడు. శ్రద్ధా దాస్ తో కలిసి రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులేశాడు. అయితే అవి కాస్త మోతాదుకి మించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
టాలీవుడ్ లో ప్రస్తుత జనరేషన్ లో కొరియోగ్రాఫర్ అనే పేరు చెప్పగానే చాలామంది శేఖర్ మాస్టర్ గుర్తొస్తాడు. ‘ఢీ’తో ఓ సాధారణ డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత అదే షోలో కప్ కొట్టి సినిమా ఛాన్సులు దక్కించుకున్నాడు. అప్పటినుంచి దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి పనిచేశాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ రచ్చ లేపుతుంటాడు. తాజాగా శ్రద్ధా దాస్ తో చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. శేఖర్ మాస్టర్ పేరు చెప్పగానే మాస్ స్టెప్పులతో పాటు మంచి కళాకారుడు కూడా గుర్తొస్తాడు. ‘ఢీ’ షోలో జడ్జిగా చాలా ఏళ్ల నుంచి ఉన్న శేఖర్ మాస్టర్ అప్పట్లో సదాతో కలిసి అప్పుడప్పుడు అల్ డ్యాన్స్ చేస్తూ అలరించేవాడు. ఆ తర్వాత ప్రియమణి, పూర్ణలతో కలిసి స్టెప్పులేసేవాడు. ఇప్పుడు మాత్రం జడ్జి శ్రద్ధా దాస్ తో కలిసి రెచ్చిపోయాడనే చెప్పాలి. హగ్స్, ఎత్తుకోవడం, దగ్గరకు తీసుకోవడం లాంటివి చేస్తూ రచ్చ చేశాడు.
తాజాగా ‘ఢీ’ ప్రోమో రిలీజైంది. క్వార్టర్ ఫైనల్ వరకు ఈ షో వచ్చేసింది. ఇందులో భాగంగానే డ్యాన్సర్లు.. ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి’ సాంగ్ కు సూపర్ స్టెప్పులేశారు. ఒరిజినల్ గా మూవీలో పాటకు కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్. దీంతో ఫెర్ఫార్మెన్స్ తర్వాత షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్, శ్రద్ధా దాస్ స్టేజీపై వచ్చి ఫెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ప్రోమో సంగతి పక్కనబెడితే.. ఈ డ్యాన్స్ పార్ట్ కాస్త తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి శేఖర్ మాస్టర్-శ్రద్ధా దాస్ డ్యాన్స్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.