‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు క్యూట్ జంట అనుకున్న మానస్- ప్రియాంక సింగ్ మధ్య దూరం ఇంకాస్త పెరిగింది. తాజా ఎపిసోడ్లలో అది చాలా దూరం వెళ్లినట్లు తెలుస్తోంది. కనీసం ఫ్రెండ్స్ లా కూడా వాళ్లు ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా కాజల్ దగ్గర మానస్.. పింకీపై కంప్లైంట్స్ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ అయ్యాక కూడా వాళ్లు ఫ్రెండ్స్ లా అయ్యేలా లేరు మరి. చాలా వరకు పింకీ విషయంలో మానస్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. నాగార్జున చెప్పిన తర్వాత కాస్త ఓపెన్ అవ్వడం మొదలు పెట్టాడు. తల్లి వచ్చిన తర్వాత ఇంక స్ట్రైట్ ఫార్వడ్ అయిపోయాడు.
మానస్ తల్లి చాటు బిడ్డ అని మరోసారి ప్రూవ్ అయిపోయింది. నేను వేలు చూపించి ఎవరిని చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాడు అని ఆమె అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అదే కారణం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మానస్ తో మాట్లాడిందో లేదో అప్పుడే వాటిని తు.చ. తప్పకుండా చేసేస్తున్నాడు. ‘నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్. కను సైగలకు కూడా రెస్పాండ్ అవ్వకూడదు. ఫోకస్డ్ గా ఉండు. గేమ్ లో డీవియేట్ కాకు. ఎందో మంది నువ్వు గెలవాలని కోరుకుంటున్నారు’ అంటూ చెప్పిన మాటలు బాగా నాటుకున్నాయి. పింకీని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదు.
పింకీని అవాయిడ్ చేస్తున్నప్పటి నుంచి కాజల్‌తో ఎక్కువగా మాట్లాడుతున్నాడు మానస్. ఒకాను సందర్భంలో ప్రియాంక చేసిన పని ఒకటి చెప్పి కోపం తెచ్చుకున్నాడు. తాను కిచెన్ లో ఉండి కొట్టి, సైదలు చేసి మానస్ కమ్ అని పిలవడాన్ని ప్రస్తావించాడు. ‘యామ్ ఐ హర్ పప్పీ’ అంటూ కోపగించుకున్నాడు. అలాంటివి చాలా చెప్పాడు. ఇప్పటివరకు ప్రియాంక ఏం చేసుకుంటుందో అని ఆలోచించిన మానస్ ఇంక గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. ప్రియాంక ఫ్రెండ్ షిప్ కంటే ఇంకా ఎక్కువ ఆశించబట్టే అలా జరిగిందని చెప్పుకొచ్చాడు. తన సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా మానస్ పిచ్చ క్లారిటీ ఇచ్చేశాడు. మరి మానస్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.