శేఖర్ మాస్టర్.. అటు ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోలు- హీరోయిన్లతో పని చేస్తూనే ఇటు ప్రైవేట్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అలా తాజాగా జరీ జరీ పంచె అంటూ ఓ సాంగ్‌ని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ సాంగ్‌లో శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ మానస్- విష్ణుప్రియ కూడా ఉన్నారు.
శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులకు విష్ణుప్రియ– మానస్ డాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. విష్ణుప్రియ ఇంత మంచి డాన్సరా అంటూ కితాబిచ్చేస్తున్నారు. మానస్ మంచి డాన్సర్ అని బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ తెలిసు. ఈ సాంగ్‌లో తన స్వాగ్, గ్రేస్, స్టెప్పులతో మానస్ సైతం ఉర్రూతలూగించేశాడు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో విష్ణుప్రియకు సంబంధించిన ఎన్నో గ్లామర్ ఫొటోషూట్స్ చూసుంటారు. కానీ, ఈ సాంగ్‌లో మాత్రం విష్ణుప్రియను చాలా కొత్తగా చూపించారు. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా, గ్లామర్‌గా చూపించారు. ఇంక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన సిగ్నేచర్ స్టెప్పులను విష్ణుప్రియ ఇరగదీసిందంతే. గురువారం యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ పాట తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆ ‘జరీ జరీ పంచె’ సాంగ్‌ను మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.