‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెఫుల్ రన్నింగ్ బుల్లితెర షోల ఒకటి. హౌస్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ గ్రూపు రాజకీయాలు, జట్టు కట్టి గేమ్ ఆడటం ఎక్కువై పోయింది. ఎవరికి వారు వారి స్నేహితులతో కలిసి అవతలి వారిని ఓడించాలని చూస్తున్నారు. మళ్లీ ఎదుటివారిపై గ్రూప్స్ గ్రూప్స్ అంటూ కామెంట్ చేసుకుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే కాజల్, యానీ మాస్టర్ మధ్య వైరం బాగా ముదురుతోంది. ప్రతి చిన్న విషయానికి వారు వాదనలు పడుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో అది శ్రుతి మించింది. అసలు ఎందుకు వాళ్లకు పడటం లేదనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న…
ఆర్జే కాజల్ అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తొలినాటి రోజుల నుంచి యానీ మాస్టర్‌కు పడలేదు. ఎప్పుడూ ఎందుకో వారి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. అది రానురాను దూరంగా మారిపోయింది. ఇప్పుడు పరస్పరం ద్వేషించుకునే దాకా వెళ్లింది. అందుకు యానీ మాస్టర్ గతంలో కాజల్‌ను చూడగానే నాకు నెగటివ్ వైబ్స్ వస్తాయి అనడమే ఉదాహరణ.
హౌస్‌లో ప్రస్తుతం యానీ మాస్టర్‌కు ఎవరూ క్లోజ్ కాదు. తనకు క్లోజ్ డాటర్స్ లాంటి శ్వేత, హమీదాలు వెళ్లిపోవడం.. గురువు నటరాజ్ మాస్టర్ కూడా లేకపోవడంతో ఆమెకు సపోర్ట్ తగ్గిపోయింది. ఇంట్లోని సభ్యుల్లో యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్‌లు యానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తుంటారు. కానీ అది ఎంతవరకు అన్నది వాళ్లకు కూడా తెలీదు. అందుకే ఎప్పుడు యానీ మాస్టర్ ఒంటరిగానే ఆడుతుంది. గ్రూపులుగా ఆడే వారిపై విరుచుకుపడుతుంది.
ఇదీ చదవండి: ఎట్టకేలకు కెప్టెన్సీ కల తీర్చుకున్న యాంకర్ రవి..
యానీ మాస్టర్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండేవారిని నామినేట్ చేయాలి అనే ధోరణితో ఉంటారు. మరోవైపు ఇంట్లోని ఆడవారికి.. ఆడవాళ్లే సపోర్ట్ చేసుకోవాలి అనేది ఆమె వాదన. కాజల్ కూడా అదే మాట చెప్తుంది. కానీ, చేతల్లో మాత్రం ఆ మాట కనిపించదు అని యానీ మాస్టర్‌కు కోపం. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆడవాళ్లను దాదాపు కాజల్ అందరినీ నామినేట్ చేసింది అనేది వాళ్ల ఆరోపణ. ఇప్పుడు ఇంట్లో ఉన్న సిరి, యానీ మాస్టర్, ప్రియాంక సింగ్‌లకు కూడా కాజలు సపోర్ట్ చేయదు అని వీళ్లు ఫిక్స్ అయిపోయారు.
తాజా ఎపిసోడ్‌లో వీళ్ల మధ్య వైరం బాగా ముదిరింది. కెప్టెన్సీ టాస్కులో సపోర్ట్ విషయంలో వీరి మధ్య వాదన తీవ్ర స్థాయికి చేరింది. రవికి సపోర్ట్ చేస్తున్న యానీ మాస్టర్‌ను కాజల్ వచ్చి కదిలిస్తుంది. అందుకు తీవ్రంగా స్పందించిన యానీ మాస్టర్ మాటలు అనడమే కాదు.. నాగిన్ డాన్సు కూడా వేసి కాజల్‌ను హ్యుమిలియేట్ చేస్తుంది. కింగ్ నాగార్జున కాజల్‌కు పెట్టిన పేరు నాగిన్. అదే మాటను రిపీట్ చేస్తూ యానీ మాస్టర్.. కాజల్‌ను కామెంట్ చేసింది. ‘నీ మాటలు, నీ ఆట దేంట్లో నిజాయితీ లేదు’ అంటూ యానీ మాస్టర్ కామెంట్ చేసింది. వీళ్ల వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.