మంచు లక్ష్మి.. ఒక విలక్షణ నటిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మంచు మోహన్ బాబు కుమార్తె అనే పేరు నుంచి మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు అనే స్థాయికి ఎదిగారు. ఒక నటిగానే కాకుండా నిర్మాతగాను అద్భుతమైన సినిమాలను అందించారు. మంచు లక్ష్మి అంటే మంచి నటి మాత్రమే కాదు.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనిషి. ప్రశ్న ఏదైనా సూటిగా స్పందిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ ఏదైనా గానీ, మంచు లక్ష్మి మాత్రం తనదైనశైలిలో స్పందిస్తారు. వెండితెరకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం లేచింది మహిళా లోకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. ఆర్జే కాజల్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి చేసిన ఓపెన్ కామెంట్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. మంచు లక్ష్మిని ఓ సినిమాకి సంబంధించి ఆర్జే కాజల్ సెల్బియన్ సె*క్స్, ఆడవాళ్లకు సంబంధించిన మెసేజ్ గురించి ప్రశ్నించింది. అయితే అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడగ్గా.. “లెస్బియన్ ప్రేమలో తప్పేముంది? నాకు గే పీపుల్, లెస్బియన్ విషయాల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. మన పురాణాల్లో ఉన్న శిఖండి ఎవరు? బృహన్నల ఎవరు? ఒక మహిళ, ఒక వ్యక్తి, వాళ్లు ఒక మహిళ లేదా వ్యక్తితో ఉండాలని నిర్ణయించడానికి మనం ఎవరు? అది వాళ్ల వ్యక్తిగత విషయం. వాళ్లు రొమాన్స్ చేసుకోవడంలో తప్పు ఉంది అంటారా?” అంటూ ప్రశ్నించారు.
ఇంక తనపై వచ్చే ట్రోల్స్ విషయంపై కూడా మంచు లక్ష్మి స్పందించారు. తానెప్పుడూ తనపై వచ్చే ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేస్తానని చెప్తారు. ఒక ఆర్టిస్టుగా నిన్ను చూసి నవ్వుకోలేకపోతే.. నువ్వ ఆర్టిస్టుగా ఎదగలేవు. ఒక సీన్‌లో డైలాగ్ మర్చిపోయానంటూ అయ్యో అయ్యో అంటూ అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. అరెరె తప్పుచేశానే అంటూ అక్కడే ఉండిపోకూడదు. అలాంటి వాటికి నేను ఎక్కువ అటెన్షన్ ఇవ్వను. దాని గురించి ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవడం వల్ల మీ టైమ్ వేస్ట్ నా టైమ్ వేస్ట్ అంటూ మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు.