ఈ మధ్యకాలంలో తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ ఇండియన్ బాక్సాఫీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. బాహుబలి, సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2 చిత్రాలతో ప్రపంచ దేశాల ప్రేక్షకుల దృష్టి టాలీవుడ్ పై పడింది. మున్ముందు తెలుగు నుండి రాబోతున్న మరిన్ని పాన్ ఇండియా సినిమాల కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే.. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమాలలో ‘పుష్ప-2’ ఒకటి. స్టార్స్ అల్లు అర్జున్ – సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప.. గతేడాది విడుదలై ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల్లో కలిపి సినిమా దాదాపు రూ. 320 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.
ఈ క్రమంలో పుష్ప సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ కిక్కిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శేషాచలం అడవి నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో చాలా మాస్ సీన్స్ ఉన్నాయి. కానీ.. ఫ్యాన్స్ కి హై ఫీలింగ్ కలిగించే, రిపీట్ మోడ్ లో చూసుకునే పర్టికులర్ హీరోయిక్ ఎలివేషన్స్.. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ లేవనే వాదన వినిపిస్తోంది. అదీగాక దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పులి ఫైట్ తో ఇంట్రడ్యూస్ చేసి థ్రిల్ కలిగించాడు. ఆ ఇంట్రో సీనే సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లేందుకు హెల్ప్ అయ్యింది. సో.. పుష్ప సినిమా అడవి నేపథ్యంలో సాగినప్పటికీ, ఎక్కడకూడా అడవి జంతువులను, వాటితో థ్రిల్లింగ్ సీన్స్ పెట్టలేదనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.
దీంతో పుష్ప మేకర్స్.. ఈసారి పుష్ప 2 కోసం భారీ ప్లాన్ వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, పులికి మధ్య జరిగిన ఫైట్ కి మించి.. పుష్ప 2లో అల్లు అర్జున్ కి, సింహానికి మధ్య ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలలో టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేగాక.. ఈ ఫైట్ సీక్వెన్స్ ని థాయిలాండ్ ఫారెస్ట్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ.. టాక్ తో పాటు ఫ్యాన్స్ కూడా సింహంతో పుష్పరాజ్ ఫైట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక సుమారు రూ. 300కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పుష్ప 2పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ కాగా, ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. చూడాలి మరి పుష్పరాజ్ పార్ట్ 2లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో!
Works of #PushpaTheRule in full flow 💥🔥 pic.twitter.com/D9rEGOhcRr
— Fukkard (@Fukkard) October 17, 2022