ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు, హైప్ లేకుండా వస్తున్న సినిమాలే భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. స్టార్డమ్ ని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీసి.. పాన్ ఇండియాను ఎలా షేక్ చేయాలో ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువహీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ అదరగొట్టింది. తక్కువ బడ్జెట్ లో కంటెంట్, క్వాలిటీ అంశాలతో రూపొందిన కార్తికేయ 2కి.. కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ రాబోతుంది.
ఇప్పటికే కార్తికేయ 3పై క్లారిటీ ఇచ్చేశాడు హీరో నిఖిల్. అయితే.. కార్తికేయ మూవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నేపథ్యంలో రాగా.. కార్తికేయ 2 ద్వారకా, శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కింది. దీంతో కార్తికేయ 3 మూవీ ఏ అంశంపై రాబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో కార్తికేయ 3కి సంబంధించి మేకర్స్ అయితే ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ.. ఈసారి కార్తికేయ 3 మూవీని అయోధ్య రామాలయం రహస్యాలను బేస్ చేసుకొని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. అంటే.. మూడో భాగంలో శ్రీరాముడి చుట్టూ కథ ఉండబోతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక కార్తికేయ 3 స్టోరీ ఏంటనేది అధికారికం కాకపోయినా.. అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఉంటుందనే విషయం తెలిసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. అదీగాక హీరో నిఖిల్ కూడా వీలైనంత త్వరగా సినిమాను తెరమీదకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు. సో.. కార్తికేయ 2 క్రియేట్ చేసిన రికార్డుల దృష్ట్యా కార్తికేయ 3ని నేరుగా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు చందూ మొండేటి వేరే స్టార్ హీరోతో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. మరి కార్తికేయ 3పై మరింత క్లారిటీ రావాలంటే మేకర్స్ ఏదొక అప్ డేట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
Actor #Nikhil about #Karthikeya3 pic.twitter.com/lTwBa743H1
— Movies For You 🇮🇳 (@Movies4u_Officl) October 17, 2022
Dekhiye Dwarka se Lord Krishna ke rahasyon tak ka ek adventurous safar!
Join the ride and discover Lord Krishna’s secrets in the epic Blockbuster Karthikeya 2, now available in Hindi and Tamil as well only on ZEE5.Watch #Karthikeya2 now on Zee5! pic.twitter.com/oIcHANXQrj
— ZEE5 (@ZEE5India) October 14, 2022