‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసిందో లేదో.. కంటెస్టెంట్లు అందరూ పుల్ బిజీగా మారిపోయారు. అందరూ సినిమాలపై కన్నేశారు. తాను హీరోగా రాబోతున్నట్లు గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ప్రకటించాడు జెస్సీ. తాజాగా తాను హీరోగా రాబోతున్న సినిమా పోస్టర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ ను బట్టి చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ లా ఉండబోయేలా ఉంది సినిమా. ముఖంపై రక్తంతో గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సన్నీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనలో ఉన్న రైటర్ గురించి బయటపెట్టాడు. తనకున్న వర్టిగో నేపథ్యంతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు జెస్సీ వెల్లడించాడు. కానీ, ఇదే స్టోరీనా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ‘ఎర్రర్ 500’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జెస్సీ హీరోగా పరిచయం కాబోతున్నాడు. సందీప్ మైత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైత్రి మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరో జెస్సీకి కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.