మోడల్ జెస్సీ.. బిగ్ బాస్ జెస్సీ.. ఇప్పుడు హీరో జెస్సీ. మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన జెస్సీకి ఒక వరంలా బిగ్ బాస్ అవకాశం దక్కింది. బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్‌ని తన కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడానికి జెస్సీ బాగా వాడుకున్నాడు. మొదటి వారంలోనే ఇంటికి వెళ్లిపోతాడు అనుకున్న కంటెస్టెంట్.. ఎలిమినేట్ మాత్రం కాలేదు. మధ్యలో తన ఆరోగ్యం సరిగ్గాలేక జెస్సీ బయటకు వచ్చేశాడు. హీరోగా కెరీర్ ప్రారంభించాలనుకున్న జెస్సీ.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్‌ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చీ రాగానే హీరోగా సినిమా స్టార్ట్ చేసేశాడు. ఇటీవలే ఎర్రర్ 500 సినిమా ట్రైలర్ కూడా విడుదలయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు మోడల్ జెస్సీ.. ఎర్రర్ 500 సినిమా ప్రమోషన్స్ పనిలో పడ్డాడు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీకి గెస్ట్ గా వచ్చిన జెస్సీ సీరియల్ నటితో స్టెప్పులు కూడా వేశాడు. బావామరదళ్లు అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో జెస్సీ సెటంర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. నిజానికి జెస్సీ అమ్మాయిలతో బాగా ఫ్లర్ట్ చేస్తాడని బిగ్ బాస్ చూసిన అందరికీ తెలిసిందే. మళ్లీ తన స్కిల్‌ని ఈ షోలో కూడా బయటపెట్టాడు. నటితో కలిసి డాన్సులు వేసి.. టాస్కులు ఆడిన తర్వాత ఆమెతో తన మనసులో మాట చెప్పాడు. తాను ఆమె కోసమే షోకి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రెండ్రోజులు తనతో చేసిన డాన్స్ ప్రాక్టీస్, చిట్ చాట్‌తో ఆమె మాయలో పడిపోయానన్నాడు.
అక్కడితో ఆగకుండా అర్ధరాత్రి 12 గంటలకు నువ్వే గొర్తొచ్చావంటూ బిస్కెట్ వేశాడు. అప్పుడు ఏం చేయాలో తోచక.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆమె ఫొటోలే చూస్తూ ఉండిపోయానంటూ డైలాగులు చెప్పాడు. ఇంకేముంది జెస్సీ మాటలకు పొంగిపోయిన నటి అతడిని గట్టిగా హత్తుకుంది. ఈ గ్యాప్‌లో జడ్జి ఇంద్రజ హార్ట్ సింబల్ సైగలు చేస్తూ.. కలర్ ఫొటో పాట హమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది వెంటనే స్క్రీన్ మీద హార్ట్ సింబల్స్, లవ్ సాంగ్స్ తో క్లోజప్స్ వేసేశారు. అయితే బిగ్ బాస్ నుంచి ఫ్లర్ట్ చేసే సెట్టు శ్వేతాని పక్కన పెట్టుకుని జెస్సీ ఇంకొకరిని బుట్టలో వేయడం కొసమెరుపు. జెస్సీ ఇవన్నీ షో కోసం చేశాడా? లేక నిజంగానే లవ్ పుట్టిందా? అనే ప్రశ్నలకు మాత్రం ఆదివారమే సమాధానం దొరుకుతుంది.