దేశంలో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో వందలు వందలు డబ్బులు పెట్టలేక చాలా మంది ప్రజారవాణా వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం.. మరో దారి లేక ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు ద్రుష్టి పెడుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఎన్నో ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. ఇలాంటి బైక్‌లలో బజాజ్ CT 100, TVS స్పోర్ట్, హీరో HF డీలక్స్, బజాజ్ ప్లాటినా 100 బాగా పాపులర్. ఈ బైక్‌లు ఎంత మైలేజీ ఇస్తాయి..? ధరలు ఎలా ఉన్నాయి..? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు బజాజ్ కంపెనీని మించింది లేదు. సీటీ 100 బైక్.. ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో వస్తున్న అత్యంత చౌకైన బైక్. దీని ప్రారంభ ఎక్స్- షోరూమ్ ధర రూ. 52,510, ఇది టాప్ మోడల్‌కు రూ. 60941 వరకు ఉంటుంది. 102 సిసి ఇంజన్ తో వచ్చిన ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 90 కి.మీ వరకు మైలేజ్ వస్తుందంటున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఇది సరైన ఎంపిక.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దీన్ని తీసుకొచ్చింది. 97.2 సిసి ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 83 కి.మీ వరకు మైలేజ్ఈ ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,000 నుంచి రూ. 82,115 మధ్య ఉంది. ఈ బైక్ BS6 ప్రమాణాలతో వచ్చింది. హీరో బైకులు దీర్ఘకాలం మన్నిక ఉంటాయి. రీసేలింగ్ కూడా ఉంటుంది.
టీవీఎస్ స్పోర్ట్ మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ బైక్. బీఎస్4 మోడల్ అప్డేట్ వర్షన్ బీఎస్6.. లుక్ పరంగా ఆకర్షణీయంగా, మైలేజి పరంగా 15 శాతం మెరుగైనట్లు సంస్థ తెలిపింది. 109.7సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ బైక్ లీటరుకు గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వరకు మైలేజి ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,500 నుంచి రూ. 68,943 మధ్య ఉంది. ఎక్కువ మైలేజీతో పాటు స్టైలిష్ బైక్ కావాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు.
బెస్ట్ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ బైక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ బైక్ లీటరుకు 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు. ఇందులో 115 సీసీ డీటీఎస్ఐ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 66,000 నుంచి ప్రారంభం అవుతోంది. గంటకు 75 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇందులో మరో వేరియంట్ కూడా ఉంది. బజాజ్ సీటీ 125 ఎక్స్ మోడల్. రెండింటి ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ మోడల్లో ఇంజిన్ పవర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువే.
గమనిక: బైక్ మైలేజ్ అనేది పలు అంశాల ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. బైక్ డ్రైవ్ చేసే విధానం, స్పీడ్, రోడ్లు, వెహికల్ మెయింటెనెన్స్ వంటి అంశాలు మైలేజ్‌పై ఆధారపడి ఉంటుంది.