‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఈ వారం మాత్రం అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యింది. గత వారమే అనుకున్నారు కానీ, రవి ఎలిమినేషన్ తో పింకీకి ఒక వారం అదనంగా లభిచింది. ఈసారి మాత్రం పింకీని పంపక తప్పలేదు. స్టేజ్ పై ప్రియాంక అందరి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది. బజ్ లో మాత్రం కాస్త భిన్నంగానే స్పందించింది. ఇద్దరి గురించి మాత్రం ప్రియాంక చాలా డిఫరెంట్ గా స్పందించింది. అదే కాజల్ అండ్ మానస్ గురించి. అప్పటివరకు మానస్ గురించి ఎంతో పాజిటివ్ గా మాట్లాడిన ప్రియాంక.. ఆ వీడియో చూశాక ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాజల్ తో మానస్ మాట్లాడిన వీడియో అది.
నేను మానస్ నుంచి అది ఎక్స్ పెక్ట్ చేయలేదంటూ ఏడ్చేసింది. ‘దీన్ని బట్టి నాకు మానస్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. అతను ఎవరినైనా చాలా ఈజీగా చదివేసి పక్కన పడేస్తాడు. నేనైతే నాకు పిల్లలు ఉంటే ఎలా చూసుకుంటానో.. అలా చూసుకున్నా మానస్‌ను’ అంటూ ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. అరియానా వచ్చి ప్రియాంకను ఓదార్చింది. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మానస్ నుంచి అలాంటి మాటలను ప్రేక్షకులు సైతం ఊహించి ఉండరు. ప్రియాంక సింగ్- మానస్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.