‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెస్‌ఫుల్ రన్నింగ్ టీవీ రియాలిటీ షో అని నిరూపించుకుంది. రోజురోజుకు హౌస్ మేట్స్ ఆట, వేటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారానికి ఒకరు చొప్పున హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పిటికే సరయు, ఉమాదేవి, లహరి ఇంటి నుంచి బయటకి వచ్చేశారు. లోపల ఉన్న వారికి బయట ఎంతపెద్దగా సపోర్ట్ జరిగితే వాళ్లు.. లోపల అన్నాళ్లు ఉండగలరు. అది వారి వారి ఆటపై ఆధారపడి ఉంటుంది కానీ, బయట కూడా సపోర్ట్ తప్పకుండా కావాలి. ఇప్పటికే లోపల వాళ్లకి బయట చాలా పెద్దఎత్తున్న సపోర్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెలబ్రిటీలు కూడా వారికి సపోర్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్, మోడల్ జెస్సీకి సపోర్ట్ చేస్తూ లేఖ రాశాడు. జబర్దస్త్ ప్రియాంక సింగ్‌కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్జే కాజల్‌కు చాలా మంది టీవీ, మూవీ ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడ ఆ జాబితాలోకి ఆర్టిస్ట్ మానస్ కూడా చేరాడు.
లవ్ యూ బ్రదర్..
మానస్ గులపల్లికి సపోర్ట్ చేస్తూ హీరో సందీప్ కిషన్ ఓ వీడియోని చేశాడు. ఆ వీడియోని మానస్ నాగులపల్లి టీమ్ ఇన్‌స్టా పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘మానస్ నాకు బాగా తెలుసు. చాలా మంచివాడు.. నా తమ్ముడు లాంటోడు. అందరూ షో చూడండి. మానస్‌కు సపోర్ట్ చేయండి. ఆల్ దిబెస్ట్ మానస్. నువ్వు గెలుపుతో బయటకు రావాలి. గెలుపు అంటే అందరి మనసులు గెలుచుకుని రావాలి’ అంటూ సందీప్ కిషన్ మానస్‌కు సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం హౌస్‌లో ఎంతో హుందాగా, కాంట్రవర్సీలు లేకుండా మానస్ ఆడుతున్నాడు. టాస్కుల్లో తన వందశాతం ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు ఫైర్ కూడా అవుతున్నాడు. మొదటివారం ఎంతో సైలెంట్‌గా ఉన్న మానస్ ఇప్పుడు మంచి గేమ్ ఆడుతున్నాడు. మరి, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారన్నది తెలియాలి అంటే ఇంకా 80 రోజుల వరకు ఆగాల్సిందే.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ గురించి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.