సినిమా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్ చేశారు? ఏ సినిమాల గురంచి అప్డేట్లు పెడుతున్నారు అనే అంశాలను వారి సోషల్ మీడియాలో ఖాతాల్లో చూస్తూ ఉంటారు. తారుల కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా నెట్టింట పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం నెట్టింట త్రోబ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు వారి త్రో బ్యాక్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు పైన చూసిన బుడ్డోడి పిక్ ఒకటి వైరల్ అవుతోంది.
ఆ పిక్‌లో ఉన్న చిన్నారి ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఒక్క తెలుగులోనే కాదు అటు తమిళ్లోనూ చాలా సినిమాలు చేశాడు. హిందీ సినిమా, వెబ్ సిరీస్‌లో కూడా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అటు లవ్లీ క్యారెక్టర్లు చేస్తూనే ఇటు గ్యాంగ్‌స్టర్ క్యారక్టర్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడైతే సిక్స్ ప్యాక్, కండలు తిరిగిన బాడీతో అదరగొట్టేస్తున్నాడు. చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ యంగ్ హీరోకి లేడీ ఫ్యాన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. మర్చిపోయా ఇతను ఒక్క హీరోనే కాదు.. ప్రొడ్యూసర్ కూడా అనమాట. ఏంటి ఇంకా గుర్తురాలేదా? అతను మరెవరో కాదు.. యంగ్ హీరో సందీప్ కిషన్.
అవును ఆ ముద్దులొలికే చిన్నారి పిక్, ఆ కండలు తిరిగిన బాడీ రెండూ సందీప్ కిషన్వే. 2010లో ప్రస్థానం సినిమాతో సందీప్ కిషన్ తెలుగులో తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించాడు. నెగెటివ్ రోల్‌తో కెరీర్ ప్రారంభించినా కూడా.. ఆ తర్వాత మంచి హీరో పాత్రలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలను బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్లోనూ చాలానే సినిమాలు చేశాడు. హిందీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించాడు. హిందీలో షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో కూడా సందీప్ కిషన్ నటించి మెప్పించాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్లోనూ సందీప్ కిషన్ మంచి అబిమానులే ఉన్నారు.
ప్రస్తుతం సందీప్ కిషన్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో మైఖేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తిగా వైలెన్స్ తో కూడుకున్నది. ఈ సినిమా కోసమే సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్‌తో తన మేకోవర్ కూడా మార్చేసుకున్నాడు. ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. అటు తమిళ్లోనూ రెండు సినిమాలు చేస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. నరగసూరన్ అనే మరో సూపర్ న్యాచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సందీప్ కిషన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ సినిమాలో అరవింద్ స్వామి, శ్రియ, ఆత్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుకున్నది సాధించాలి అంటే అదృష్టం కాదు.. హార్డ్ వర్క్ ముఖ్యం అంటూ సందీప్ కిషన్ చెబుతూ ఉంటాడు.