తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది. బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ను వీజే సన్నీ గెలిచాడు. 15 వారాల పాటు అత్యంత విజయవంతంగా సాగిన ఈ షోలో సన్నీ విజేతగా నిలిచాడు. ఈ షోల్ లో సన్నీతో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గోన్నారు. వారందరిని వెనక్కి నెట్టి సన్నీ టైటిల్ గెలిచాడు.
ఇక ఈ సారి ట్రోఫీని ముద్దాడిన సన్నీకి అదిరిపోయే ప్రైజ్ మనీ ఇవ్వనుంది స్టార్ మా యాజమాన్యం. గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 5 విజేతకు ఎక్కువ మొత్తం లభించనుంది. ఎప్పట్లాగే బిగ్ బాస్ విన్నర్‌కి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. నాలుగో సీజన్ కంటే ముందు కాస్త తక్కువగా ఇచ్చారు. కానీ నాలుగో సీజన్ నుంచి ప్రైజ్ మనీని పెంచారు.
అయితే ఈ సారి మాత్రం విజేత గా నిలిచిన వీజే సన్నీకి ప్రైజ్ మనీతో పాటు 300 స్క్వేర్ ఫీట్ గల ఫ్లాట్ కూడా కూడా దక్కబోతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్ మనీ అన్నది అత్యధికం. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ టైటిల్ విన్నర్ వీజే కి 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు అదనంగా ఫ్లాట్ కూడా ఇవ్వబోతున్నారు.
బిగ్ బాస్ 5 తెలుగు విజేతగా సన్నీకి రూ.50 లక్షలు వచ్చినా కూడా అందులో కట్టింగ్స్ చాలా ఉంటాయి. దాదాపు 15 లక్షలకు పైగానే కట్ చేసి మిగిలిన మొత్తం అంటే రూ.35 లక్షలు అందచేస్తారు. ఏదైనా రియాలిటీ షోలో గెలిచిన డబ్బుకు ట్యాక్స్ కటింగ్ ఉంటుంది. బిగ్ బాస్ కూడా ఇంతే. మొత్తానికి సన్నీ ప్రైజ్ మనీతో పాటు ఫ్లాట్, తన రెమ్యనరేషన్ కలిపి దాదాపు కోటికి పైగానే బిగ్ బాస్ నుంచి తీసుకెళ్లనున్నాడు. గత సీజన్‌లో విన్నర్ అభిజీత్ కు 50 లక్షలు రాగా.. రన్నర్ అఖిల్ కేవలం రెమ్యునరేషన్ తోనే సరిపెట్టుకున్నాడు. కానీ మూడో స్థానంలో ఉన్న సోహెల్ మాత్రం 25 లక్షలు తీసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీకి ఈ స్థాయిలో ఫలితం దక్కడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.