తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షో బిగ్ బాస్ 5 తెలుగుకి ఎట్టకేలకు తెరపడింది. 105 రోజుల పాటు సాగిన వీరి ఆటలో ఆదివారం జరిగిన ఫైనల్ లో విజేతగా నిలిచాడు వీజే సన్ని. ఇక ఫైనల్ వరకు గట్టిపోటీ నిచ్చిన షణ్ముక్ జస్వంత్ చివరికి రన్నరప్ గా నిలిచాడు. ఇక ఎంతో అట్టహాసంగా సాగిన బిగ్ బాస్ 5 ఫైనల్ లో మిగత కంటెస్టెంట్లు సైతం హాజరై ఎంతో ఉత్సహంగా పాల్గొని సన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే..? బిగ్ బాస్ ఫైనల్ కావడం, రోజంత షూటింగ్, గెలిచిన తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్ట్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దీంతో ఒక్కసారిగా సన్నీ తీవ్ర ఒత్తడికి గురి కావడం, బయటకు వచ్చిన తర్వాత సన్నీని కలుసుకునేందుకు ఆయన ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో వీజే సన్నీ తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్పందించిన సహాయకులు సన్నీని ఆస్పత్రికి తరలించారు. ఈ విషమం తెలుసుకున్నసన్నీ ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు.