‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ వీజే సన్నీ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీజే సన్నీకి ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ అన్నీ కలిపి కోటిపైనే అందాయి. వాటిలో ట్యాక్సులు పోను సన్నీకి దాదాపు రూ.80 లక్షల వరకూ దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఆ ప్రైజ్ మనీతో సన్నీ ఏం చేయబోతున్నాడు? ఈ విషయానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ లోనే సన్నీ సమాధానం చెప్పాడు.
ఇది కూడా చదవండి: సన్నీ ప్రైజ్మనీ కోటి పైనే.. కానీ చేతికొచ్చేది ఎంతంటే..?
‘ప్రైజ్ మనీగా వచ్చే రూ.50 లక్షలతో ఏం చేస్తారని సన్నీని అడగ్గా.. సువర్ణ కుటీర్ నుంచి వచ్చే ప్లాట్ లో అమ్మ కళావతికి ఇల్లు కట్టిస్తాను. కొంత అమౌంట్ మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తాను. దాని కోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తున్నాను. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నాను. ఈ ప్రైజ్ మనీ నా కల నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ ఎప్పటినుంచో ఒక యాక్టింగ్ స్కూల్ స్థాపించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎంతో నామినల్ ఫీజ్ తో ఆసక్తి ఉన్న అందరికీ మంచి ట్రైనింగ్ ఇవ్వాలని సన్నీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫుల్ ఫిల్ అవ్వాలని కోరుకుందాం.