‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులే ఉంది. టాప్- 5 కంటెస్టెంటుల్లో ఎవరు విన్నర్ అవుతారనే చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు ఆ విన్నర్ కు టైటిల్ ఎవరు ఇస్తారు అనే దానిపై కూడా పెద్ద చర్చ నడుస్తోంది. గత సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి విన్నర్ కు టైటిల్ అందించారు. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వస్తారు అనేది ప్రశ్న. అయితే అందుకు వినిపిస్తున్న పేర్ల జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. ఈసారి టాలీవుడ్- బాలీవుడ్ తారాగణాన్ని ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తోంది.
గ్రాండ్ ఫినాలే అతిథులుగా దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్, రామ్ చరణ్, ఆలియా భట్ లు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే గానీ జరిగితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఎప్పుడు లేని విధంగా టీఆర్పీలు పెరిగిపోతాయి. ఈ సీజన్ మధ్యలో కాస్త టీఆర్పీ తగ్గిందనే వార్తలు వినిపించాయి. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా చెబుతున్నారు. మరోవైపు విన్నర్ ఎవరు అనే దానిపై కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది.
అభిమానులు మాత్రం తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఓట్లు వేసేస్తున్నారు. ఈ సీజన్ లో విన్నర్ ఎవరు అని తేల్చడం కూడా చాలా కష్టమనే అనిపిస్తోంది. విన్నర్ విషయం పక్కన పెడితే అతిథుల లిస్టు మాత్రం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బాలీవుడ్ భామలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను చూసేందుకైనా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ను కచ్చితంగా చూస్తారు. బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.