‘బిగ్ బాస్ 5 తెలుగు’ గేమ్ విషయంలో ఎప్పుడూ వినిపించే ఆరోపణ ఓటింగ్ గురించి. అభిమానులు ఎన్ని ఓట్లు వేసినా.. ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ ఇష్టమే అనేది విమర్శ. ఇప్పుడు యాంకర్ రవి ఎలిమినేషన్ తో మరోసారి ఆ ఆరోపణ తెర మీదకు వచ్చింది. రవి ఎలిమినేషన్ విషయంలో కుట్ర జరిగిందంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. అసలు రవికి ఎన్ని ఓట్లు వచ్చాయో బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అధికారిక ఓటింగ్ విషయం కాసేపు పక్కన పెడితే. బిగ్ బాస్ సీజన్ మొదలైన సమయం నుంచి ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఓటింగ్ జరుగుతూనే ఉంది. దాదాపు అవి నిజం కూడా అవుతున్నాయి. వాటన్నింటిలో యాంకర్ రవి మూడో ప్లేస్ లో ఉన్నాడు అనేది వారి వాదన. థార్డ్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ వాదిస్తున్నారు. అన్ని ఓటింగ్స్ లో ప్రియాంక సింగ్ లీస్ట్ పొజిషన్ లో ఉందని.. కావాలనే రవిని పంపేశారంటూ ఆరోపిస్తున్నారు.
యాంకర్ రవి అభిమానులు ఎలిమినేషన్ విషయం తెలిసినప్పటి నుంచి నిరసనలు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ నిరసన కొనసాగుతూనే ఉంది. రవిని తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలనేది వారి డిమాండ్. అసలు రవికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయట పెట్టాలంటూ కోరుతున్నారు. ‘ఓట్లు వేసిన మేము పిచ్చోళ్లమా? రవికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయట పెట్టాలి. ఈ ఎలిమినేషన్ లో ఎవరికి ఎన్ని ఓట్లు పడింది బహిర్గతం చేయాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓటింగ్ విషయంలో నిజంగానే రవికి అన్యాయం జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.