వైసీపీ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒకరు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర ఉండే నేతల్లో బాలినేని ఒకరు. అలాంటి ఆయన వైసీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒకరు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే నేతల్లో బాలినేని ఒకరు. అయితే గతకొంతకాలం నుంచి బాలినేని పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అన్నట్లు తరచూ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రకాశం జిల్లాలో జరిగిన సీఎం సభలో బాలినేనికి చేదు అనుభవం ఎదురవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఏకంగా వైసీపీ పార్టీకే షాకిస్తూ బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశంలో జిల్లాలో వైసీపీ కీలక నేతల్లో ఒకరు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి. వైసీపీ పార్టీ ఏర్పడి నాటి నుంచి జగన్ వెంటనే బాలినేని నడిచారు. గతంలో ఆయనను చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతీయ సమన్వయ కర్తగా అధిష్టానం నియమించింది. అయితే తాజాగా ఆ పదవికి రాజీనామా చేస్తూ బాలినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ బాలినేని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అస్వస్థతో హైదరాబాద్ లో ఉన్నారు. గతంలోనూ తనను మంత్రి పదవి నుంచి తొలగించడంతో బాలినేని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సయమంలో సీఎం జగన్ తో భేటీ జరగడంతో మళ్లీ పార్టీలో యాక్టీవ్ అయ్యారు. అయితే తనకు పార్టీ అప్పగించిన పదవికి రాజీనామా చేస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన తీసుకున్న నిర్ణయంపై అధిష్టానం ఎలా స్పందిస్తూదో చూడాలి.