ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మీ బరువు తగ్గిస్తామంటూ వెయిట్ లాస్ సంస్థలు మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. అయితే వీటిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మీ బరువు తగ్గిస్తామంటూ వెయిట్ లాస్ సంస్థలు మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. చాలా ఈజీగా బరువు తగొచ్చంటూ ఆకట్టుకునే యాడ్స్ తో ఇట్టే ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. అయితే బరువు తగ్గాలనే తపనలో పడి చాలా మంది కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వెయిట్ లాస్ అవుదామని ఎంతో మంది అనారోగ్యం బారిన పడ్డారు. తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన కొందరు మహిళలు కూడా తాము చేసిన తప్పు చేయవద్దంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏలూరులో కూడా మరికొందరు మహిళలు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరు చికిత్స కోసం అనారోగ్యం పాలయ్యానని తెలిపింది. అలానే తన పేరు మీద వేరే వాళ్లు రుణాలు తీసుకోవడంతో ఇబ్బందిపడుతున్నామని మరో మహిళ చెబుతున్నారు. ఓ మహిళ మాట్లాడుతూ.. యాడ్ చూసి తన కొడుకు బరువు తగ్గించాలని వెయిట్ లాస్ సంస్థలోకి తీసుకొని వెళ్లినట్లు తెలిపింది. అక్కడ రూ.500 ఫీజు తీసుకుని, తమ బిడ్డకు కొన్ని పరీక్షలు చేసి.. చికిత్స తీసుకోవాలని తమతో చెప్పారన్నారు.
అలానే ఖర్చు ఎంత అవుతుందని అడిగితే చెప్పలేదని, తన పాన్, ఆధార్ కార్డులు తీసుకుని లోన్ కి దరఖాస్తు చేశారన్నారు. అలా తన పేరు మీద రూ.80 వేల వరకు రుణం తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సదరు సంస్థకు వెళ్లి అడగగా తనను బెదిరించారని ఆమె వాపోయింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. తనకు తెలియకుండా రుణం తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. తనలా ఎంతో మంది బాధితులు ఉన్నారని ఫిర్యాదులో మహిళ పేర్కొంది.
ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన మరో మహిళ కూడా ఆ సంస్థకు వెళ్లారు. ఆమె వద్ద నుంచి పలు సందర్భాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారు. చివరకు వెయిట్ లాస్ కు వెళ్తే.. అప్పుల పాలయ్యామని బాధితురాలు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. బరువు తగ్గడం కోసం వెళ్తే.. కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. బరువు తగ్గాలని భావించి వెళితే ఇలా ఆస్పత్రి పాలయ్యామని బాధితులు చెబుతున్నారు. మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.