విజ్ఞాన సంపదతో నేటి సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇలాంటి కాలంలో కూడా అక్కడక్కడ మూఢనమ్మకాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యం క్షుద్రపూజలు, మంత్రాలు వంటి వాటి కారణంగా ప్రజల భయభ్రాంతులకు గురవుతుంటారు. తాజాగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం రేగింది.
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలోనూ ఇంకా మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాకెట్ స్పీడ్ తో ఒక కొత్త ప్రపంచం దూసుకుపోతుంటే మరోవైపు కొందరు జనాలు మూఢ నమ్మకాలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రంలోని పలు జిల్లాలలో తరచూ క్షుద్ర పూజల కలకలం కనిపిస్తుంది. దీంతో క్షుద్రపూజలు, మంత్రాల పేరు విన్నగానే భయంతో ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సులో క్షుద్రపూజల కలకలం రేగింది. బస్సులో అన్నం ముద్దలు, నిమ్మకాయలు, ముగ్గులు కనిపించడంతో విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా నూజివీడు మండలం క్రిష్ణారావుపాలెంలో క్షుద్రపూజల కలకలం రేగింది. అక్కడ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పార్క్ చేసిన బస్సులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని తెలుస్తోంది. ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో పార్కింగ్ చేసిన ఓ ప్రైవేటు కాలేజి బస్సులో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఎవరో కావాలనే పిల్లలు ప్రయాణించే బస్సులో క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఈ పూజలు జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. క్షుద్రపూజల కలకలంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయాందోళకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
బస్సులో నిమ్మకాలకు పసుపు ,కుంకుమలతో డ్రైవర్ సీటు వెనుకాల తగిలించారు. అలానే బస్సు మధ్యలో ముగ్గులు వేసి అన్నం ముద్దలు, నిమ్మకాలు, మిరపకాయలు వంటి వేశారు. బస్సులో ఈ దృశ్యాని చూసిన విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే భయపడుతున్న విద్యార్ధులను సదరు కాలేజీ యాజమాన్యం మరోక బస్సులో తరలించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా క్షుద్రపూజలు జరిగాయా? లేకా ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఆధునిక సమాజంలో క్షుద్రపూజలు వంటి మూఢనమ్మకాలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నరు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.