తల్లిదండ్రులతో కలిసి ఓ యువతి జాతరకు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో కలసి ఎంతో సంతోషంగా గడిపింది. జాతర అనంతరం తిరిగి ఇంటికి అర్థరాత్రి సమయంలో బయల్దేరింది. ఈ క్రమంలో అనుకోని సంఘటనతో ఆ యువతి విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ భూ ప్రపంచంలో అమ్మానాన్నల ప్రేమకు మించినది మరొకటి ఉండదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తాము ఎన్ని కష్టాలు పడుతున్నా పిల్లలను మాత్రం సుఖంగా ఉండేలా చూస్తారు. అయితే ఇలా ఎంతో ప్రేమగా బిడ్డలను చూసుకుంటుంటే కొందరి పై దేవుడు చిన్న చూపు చూస్తాడు. వారు ప్రాణానికి ప్రాణంగా చూసుకుని పిల్లలను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తాడు. తమ బిడ్డ మరణవార్తతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. అప్పటి వరకు తన తల్లిదండ్రులతో సంతోషంగా గడిపిన ఓ యువతి.. జాతరకు వెళ్లి.. విగత జీవిగా మారింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో గంటారావు, లక్ష్మీ కుమారి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భవ్యమణి దీపిక(22) అనే ఓ కుమార్తె ఉంది. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు పెద్ద ఎత్తున జాతరకు వెళ్లారు. ఈక్రమంలో భవ్యమణి కూడా జాతరకు వెళ్లాలని భావించింది. శనివారం రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి జాతరకు రెడ్డి గణపవరం వెళ్లింది. జాతరలో తల్లిదండ్రులతో కలిసి భవ్యమణి ఎంతో ఆనందంగా గడిపింది. ఇక జాతర పూర్తైన అనంతరం గంటారావు కుటుంబ తిరిగి అర్ధరాత్రి ఇంటికి బయలు దేరారు.
జంగారెడ్డి గూడెం మండలం పట్టెన్నపాలెం గ్రామ శివారులోకి రాగానే వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ పై ఉన్న ఆ ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ భవ్యమణి దీపిక తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎంతో ప్రేమతో, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. వారి వేదన చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.