ఇటీవలే ఏపీ విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాలు నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని రాష్ట్ర వ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇలా వారు తీసుకున్న నిర్ణయం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు. తాజాగా కడపలో కూడా విషాదం చోటుచేసుకుంది.
ఇటీవలే ఏపీ విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాలు నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని రాష్ట్ర వ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా వారు తీసుకున్న నిర్ణయం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు. తాజాగా కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కూతురు పరీక్షలు తల్లికి మరణానికి కారణయ్యాయి. కూతురు ఇంటర్ ఫెయిల్ అయిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కడప పట్టణంలోని ఏన్నార్ నగర్ కు చెందిన గౌతమి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె స్థానిక ఇంటర్ కాలేజీలో ఫస్టియర్ చదువుతుంది. ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గౌతమి ఒక సబ్జెట్ లో ఫెయిల్ అయింది. దీంతో ఆమె తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోవటాన్ని తల్లి ఆదిలక్ష్మీ జీర్ణించుకోలేక పోయింది. బిడ్డ గురించి ఆమె ఆలోచిస్తూ దిగాలు గా ఉంది.
కూతురి గురించి తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. తాను ఇక బ్రతికుండి వ్యర్థమని భావించింది. పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కుమార్తె ఇంటర్ ఫలితాలు తల్లి ప్రాణం మీదకు తెచ్చాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆదిలక్ష్మి ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆమె తొందరపడి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వచ్చిన తరువాత ఈ కొద్ది రోజుల్లోనే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటన మాత్రం అందరిని తీవ్ర దిగ్బ్రాంత్రికి గురిచేసింది. బిడ్డ పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికి క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.