కరోనా కారణంగా కుదేలైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ తీసి వేయడంతో షూటింగ్స్ మొదలయ్యాయి. ధియేటర్స్ కూడా ఓపెన్ అవ్వడంతో చాలా సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో ఏపీలో ఓపెన్ అవుతుండగా.. తెలంగాణలో 100 శాతం సీటింగ్ క్యాపాసిటీతో తెరుచుకోనున్నాయి. కరోనా థర్డ్ వేవ్ రావచ్చన్న అంచనాల నేపథ్యంలో 50 శాతం సీటింగ్ పాలసీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేరు. కానీ.., సినీ ఇండస్ట్రీ పెద్దలకి షాక్ ఇస్తూ.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఇక నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే టికెట్స్ ధరలు నిర్ణయించబడుతాయని జగన్ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. థియేటర్స్ లోని వివిధ క్యాటగిరీలను బట్టి ఈ ధరలను నిర్ణయించనున్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల భారీ బడ్జెట్ చిత్రాలకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యిందని చెప్పుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలకి మొదటి వారంలో టికెట్స్ రేటు విపరీతంగా పెంచేయడం ఆనవాయితీగా వస్తోంది. వకీల్ సాబ్ మూవీ సమయంలో జగన్ ప్రభుత్వం ఈ అంశంపై ద్రుష్టి పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.