విశాఖ నగర వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఒకటి 'ఇందిరా జూ పార్కు’. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్.. హైదరాబాద్ జూపార్కు తర్వా త ఇదే పెద్దది. ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్ ఉన్నాయి. అయితే..
విశాఖ అనగానే అందమైన సముద్ర తీరమే కాదూ కైలాశ గిరితో పాటు జూ పార్కును సందర్శిస్తుంటారు పర్యాటకులు. విశాఖ నగర వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఒకటి ‘ఇందిరా జూ పార్కు’. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్.. హైదరాబాద్ జూపార్కు తర్వా త ఇదే పెద్దది. ఈ జంతు ప్రదర్శన శాల 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ జంతు ప్రదర్శనశాలలో దాదాపు 1,500 జాతుల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటున్నాయి. పిల్లలకు, పెద్దలకు ఇది మంచి పర్యాటక స్థలం. వేసవి, ఇతర సెలవుల్లో తమ పిల్లలతో ఈ ‘జూ’కు ఎక్కువగా ఇష్టపడుతుంటారు పెద్దలు. ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి ఎన్నో వైవిధ్య జాతుల జంతువులు ఉన్నాయి.
ఈ జూ పార్కులో 16 ఏళ్లుగా పర్యాటకులను అలరించిన తెల్లపులి కుమారి చనిపోయింది. దీనికి 19 ఏళ్లు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో అది చనిపోయినట్లు తెలుస్తోంది. దీన్ని హైదరాబాద్ నుండి ఇక్కడకు తరలించారు. 16 సంవత్సరాలపాటుగా సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటు తన తన సంతతిని ఉత్పత్తి చేసింది. అక్కడ జూ పార్కులో ఎన్ క్లోజరులో ఉంచారు. చాలా హుషారుగా ఉంటూ చెట్లను ఎక్కుతూ, జూ పార్కుకు వచ్చే సందర్శకులను బాగా కనువిందు చేసేది. 2007 కంటే ముందు ఈ జూ పార్కులో ఇలాంటి రకానికి చెందిన పులులు లేవు. అయితే 2007లో హైదరాబాద్ నెహ్రు జులాజికల్ పార్కు నుండి తెల్లపులి కుమారితో పాటు, మగ తెల్ల పులిని విశాఖ ఇందిరా జూ పార్కుకి అధికారులు తీసుకు వచ్చారు.
అప్పటి నుండి ఇది ఎన్ క్లోజర్ లో ఉంది. ఇప్పటి వరకు ఇది మూడు సార్లు గర్భం దాల్చగా.. 9 పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలోనే కొన్నింటిని జంతుమార్పిడి ద్వారా ఇక్కడ ఉన్న అధికారులు ఇతర జూ పార్కలకు తీసుకెళ్లి అక్కడ నుంచి కొన్ని రకాలైన జంతువులను విశాఖ జూ కి తీసుకువచ్చారు. అలాగే కాన్పూర్ లో ఉన్న జంతు ప్రదర్శన శాలకు రెండు తెల్ల పులులను ఇచ్చి.. ఒక ఖడ్గ మృగాన్ని తెచ్చారు. కుమారి చనిపోవడంతో ప్రస్తుతం జూలో ఐదు తెల్ల పులులున్నట్లు, విశాఖ ఇన్ చార్జీ క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు పనిచేయకపోవడంతో చనిపోయినట్లు చెప్పారు. ఎంతో కాలంగా ఇక్కడే ఉన్న తెల్లపులి చనిపోయే సరికి దాని సంరక్షకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.