దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ ఓ బుక్‌ను రిలీజ్ చేసింది. ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పేరిట రూపొందిన ఈ పుస్తక ముఖచిత్రం వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలతో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతోంది. అయితే, ఆ హత్య ఎవరు చేశారన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ సీబీఐ అధికారుల చేతికి వెళ్లింది. ప్రస్తుతం తెలంగాణ సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు వెళ్లాయి. ఆయన సీబీఐ అధికారుల ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు. ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పక్ష పార్టీ టీడీపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఓ పుస్తకం రిలీజ్ చేసింది.
‘‘జగనాసుర రక్త చరిత్ర’’ అంటూ ఆ పుస్తకానికి పేరు కూడా పెట్టింది. ఆ పుస్తకం కవర్ పేజీపై వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఈ పుస్తకంలో వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది? హత్యకు కారకులెవరు? ఆ రోజు ఏం జరిగింది? అన్న అంశాలు ఉన్నాయంట. వచ్చే ఎన్నికల్లో వివేకా హత్యను బలంగా తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోందట. మొత్తం 24 పేజీల్లో అన్ని విషయాలను కూలంకశంగా వివరించారట. సీబీఐ ఛార్జ్‌షీటులో పేర్కొన్న ఆధారాలను బేస్ చేసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గుండెకు సంట్స్ వేయించుకుని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న 70 ఏళ్ల వివేకా గంటల పాటు నరక యాతన పడి చనిపోయినట్లు ఇందులో పేర్కొన్నారట. వివేకానందరెడ్డి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలాలను సైతం ఈ పుస్తకంలో ప్రాస్తావించారట.
హత్య, హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఏం చేశారు? గుండె పోటు నాటకం, ఇతర విషయాలను వివరించారట. అంతేకాదు! సీబీఐ అధికారిపై పెట్టిన కేసులు.. కేసు సీబీఐకి వెళ్లటం.. సీబీఐ వాంగ్మూలాలు నమోదు చేయటం.. నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిపోవటం.. సాక్ష్యులకు బెదిరింపులు.. ఇలా పలు విషయాలను ప్రస్తావించారట. చివర్లో వైఎస్ జగన్‌కు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలను, ఇతర విషయాలను ఫొటోలతో సహా ఇచ్చారంట. మరి, టీడీపీ విడుదల చేసిన ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పుస్తకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.