ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. అధికార వైసీపీపై నిప్పులు చేరుగుతుంది. టీడీపీ నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతల ఆరోపణలకు ధీటుగా వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నేతలు… వైసీపీ నేతలతో పాటు ఏపీ పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీనేతలు ఏపీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తున్న పోలీసుల పని పడతానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గురువారం గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో సహా టీడీపీకి చెందిన ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు ఏపీ పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న పోలీసులకు తాను హోంమంత్రి అయ్యాక షూట్ ఎట్ సైటేనని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చెంతకే చేరాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తనకు హోమంత్రి తో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఇస్తే పోలీసుల సంగతి తెలుస్తానంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
ఇంకా అయ్యన్న మాట్లాడుతూ.. “త్వరలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక నాకు హోంమంత్రి పదవితో పాటు లాండ్ ఆర్డర్ కూడా ఇవ్వాలి. అలానే షూట్ అండ్ సైట్ అధికారులు అప్పగించాలి. దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసుల లిస్టు రెడీ చేస్తా. అప్పుడు ఆ పోలీసుల సంగతి చెబుతా. మరికొన్ని నెలల్లో చంద్రబాబు సీఎం అవడం ఖాయం. ఈ దౌర్భాగ్యులంతా జైలుకు వెళతారు” అంటూ అయ్యన్న పాత్రుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులపై అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడేక్కించాయి.
గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పాత్రుడు.. పోలీసులుపై నోరు పారేసుకున్నారు. ఉత్తరాంధ్ర యాసను జోడించి.. ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఆయన ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలకుండా విమర్శించారు. దీనికి పోలీసుల స్పందన ఎలా ఉండబోతోందో.. చూడాలి. ప్రస్తుతం అయ్యన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.