గత కొంత కాలంగా అధికార పక్షంపై ప్రతి చిన్న విషయంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష నేతలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇటీవల మానసిక వికరాంగురాలిపై కొంత మంది కామాంధులు అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వచ్చారు. అతే సమయానికి లో మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం ఆమెను పరామర్శించేందుక రావడం జరిగింది.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయని ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. అదే సమయంలో టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ, వాసిరెడ్డి పద్మకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తనపై కావాలనే ఇలా అటాక్ చేశారని వాసిరెడ్డి పద్మ టీడీపీ నేతలను విమర్శించారు.
తనను కావాలనే అగౌర పరిచారని.. ఒక మహిళ కమిషన్ చైర్ పర్సన్ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంతో చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.