ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయలంతా ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూనే నడుస్తోన్నాయి. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతి పక్ష టీడీపీ, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతోంది. గోరంట్ల అంశంపై వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్టారెడ్డికి స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అనిత పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మహిళ కమిషన్ స్పందించింది.
ఈ ఎంపీ గోరంట్ల వ్యవహారంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలన్నారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖరాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపీ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవ్ ఖండించిన సంగతి తెలిసిందే.ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి కూడా స్పందించి.. నిజమని తేలితే పార్టీపరంగా చర్యలు తప్పవని వెల్లడించారు.
ఎంపీ మాధవ్ వ్యవహారం రాజకీయంగా అనేక ఆరోపణలు వస్తుండడంతో మహిళా కమిషన్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. మరి.. గోరంట్ల వ్యవహారంపై మహిళ కమిషన్ స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించిన ఎంపీ కేశినేని నాని!
ఇదీ చదవండి: ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ 30 ఇయర్స్ పృథ్వీ డిమాండ్!