కీలకమైన పదవులు, స్థానాల్లో ఉన్న వారు మహిళల గురించి మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట పొరపాటుగా మాట్లాడిన.. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
మన సమాజం, రాజ్యాంగం అణగారిన వారికి కొన్ని ప్రత్యేక హక్కులు, అవకాశాలు కల్పించింది. ఈ అణగారిని వర్గాల జాబితాలోకి మహిళలు కూడా వస్తారు. ఎందుకంటే అనాదిగా మన సమాజంలో.. ఆడవాళ్లు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఆడవారు అంటే కేవలం వంటింటిని అంటిపెట్టుకుని ఉండి. ఇంట్లో వాళ్ల అవసరాలు తీర్చాలి అనే ఆలోచన మన సమాజంలో అనాదిగా వేళ్లూనుకుపోయింది. ఆడవారి మీద అనేక ఆంక్షలు.. ఇక వివాహం తర్వాత.. మెట్టినింట్లో.. ఆడవాళ్లు ఎదుర్కొనే కష్టాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. అనాదిగా ఇలా వివక్షకు గురవుతున్న ఆడవారి కోసం మన రాజ్యాంగం ప్రత్యేక హక్కులు, చట్టాలు కల్పించింది. వారిపై అఘాయిత్యాల నివారణకు ఎన్నో కఠిన చట్టాలు చేసింది. కేవలం చేష్టల ద్వారానే కాక.. మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా శిక్షార్హులే అని చెప్పుకొచ్చింది.
సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే.. మహిళల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, పనులకు పాల్పడటం వంటివి చేస్తే.. వారు శిక్షార్హులు. ఇలాంటి వారిని ప్రశ్నించడంలో మహిళా కమిషన్ ముందుంటుంది. స్త్రీలకు ఏ కష్టం వచ్చిన వాళ్ల తరఫున మేమున్నామంటూ మహిళా కమిషన్ నిలబడుతుంది. మహిళల గురించి గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా.. బాధితుల తరఫున వకాల్తా పుచ్చుకుని మరి నిలదీస్తూ.. వారికి అండగా నిలుస్తుంది మహిళా కమిషన్. ఈ కమిషన్ ఉన్నదే ఆడవారి కోసం. కానీ తొలిసారి మహిళా కమిషన్ తన తీరుకు భిన్నంగా ప్రవర్తించింది. మహిళలకు మద్దతుగా నిలబడాల్సింది పోయి.. వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాలు..
హర్యానా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఒకర్ అమ్మాయిల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఈ కాంట్రవర్సీకి తెర తీశారు. హర్యానాలోని కైతల్‌లోని ఓ కాలేజీలోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేణు భాటియా.. లా అండ్ సైబర్ క్రైమ్‌పై మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కేసుల్లో చాలా వరకు బాలికలు బాధ్యులవుతున్నారన్నారు. ఈ క్రమంలోనే ఆమె అమ్మాయిలు ఓయో రూమ్‌కు వెళ్లేది పూజలు చేయటానికో.. హారతులు ఇవ్వడానికో కాదని.. అలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు.. అక్కడు వెళ్లాక మీకు హాని జరగోచ్చు అని గుర్తుంచుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేణు భాటియా.
అంతేకాక సహజీవనం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రేణు భాటియా. సహజీవనం విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్ వల్ల మహిళలకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయని.. వాటిని పరిష్కరించడంలో మహిళా కమిషన్ పరిధి చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాక ప్రస్తుతం సమాజంలో.. సహజీవనం కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయన్న రేణు భాటియా.. మహిళలపై లైంగిక దాడులు జరగడానికి వాళ్లు కూడా కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేణు భాటియా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహిళలకు అండగా నిలబడే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వంటి అత్యున్నత స్థానంలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని నిలదీస్తున్నారు జనాలు. మరి రేణు భాటియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.