బ్రిటీష్ వారి రాకపూర్వం వరకు మన దేశంలో చేనేత రంగం ఎంతో వైభవంగా వెలిగిపోయింది. మన నేతన్నల ప్రతిభ విదేశాలకు కూడా పాకిపోయింది. ఎన్నో రాజ్యాలకు మన దేశం నుంచి దుస్తులు ఎగుమతి అయ్యేవి. ఇక నేటి కాలంలో కూడా కొందరు నేతన్నలు అద్బుతమైన పని తీరుతో.. ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎంత శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. భక్తుల మొర వినే బంగారు తల్లిగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చనందుకు కృతజ్ఞతగా మొక్కలు తీర్చుకుంటారు. కొందరు భక్తులు అమ్మవారికి.. విలువైన, అరుదైన కానుకలు సమర్పిస్తారు. తాజాగా ఓ భక్తుడు.. అమ్మవారిఇకి బంగారు చీరను సమర్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఇంతకు అమ్మవారికి బంగారు చీర సమర్పించిన వ్యక్తి ఎవరు.. చీర ఖరీదు ఎంత పడింది.. ఎన్ని గ్రాముల బంగారం వాడారు వంటి వివరాలు..
చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు అయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్.. అనే భక్తుడు విజయవాడ దుర్గమ్మకు బంగారు చీరను సమర్పించారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చీర అగ్గిపెట్టలో పట్టేంత పల్చగా ఉండటం విశేషం. ఈ చీరను ఐదు గ్రామాల బంగారంతో పాటు తులం వెండితో.. పట్టు దారాలతో నేశారు. ఇక చీర ధర 45 వేల రూపాయలు ఉంటుందని చెబుతున్నాడు. మొత్తంగా చీర బరువు 100 గ్రాములు ఉంది. అమ్మవారికి అగ్గిపెట్టలో బంగారపు చీరను సమర్పించడం సంతోషంగా ఉందని.. తల్లి దయతో చేనేత కార్మికులు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు విజయ్.
విజయ్ తీసుకువచ్చిన చీరను అమ్మవారికి సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పండితులు. అనంతరం విజయ్‌కు వేద ఆశీర్వచనాలు అందించారు. కేవలం దుర్గమ్మకు మాత్రమే కాక.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను సమర్పించాడు విజయ్. ఇక గతంలో ఇతను సువాసనలు వెదజల్లే.. వెండి చీరను కూడా తయారు చేశాడు. అలాగే అగ్గిపెట్టెలో పట్టే చీర నుంచి దబ్బనంలో పట్టే చీర వరకు ఇలా ఎన్నో వెరైటీలను తయారు చేసి ప్రత్యేకతను చాటుకున్నాడు విజయ్. మరి విజయ్ ప్రతిభ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.