ఏపీలోని చింతూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే గంటల వ్యవధిలో వైద్యుల కళ్లముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వైద్యులను సైతం కలిచివేసింది. అసలు ఒకే కుటుంబంలోని ముగ్గురు ఎలా చనిపోయారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని కూంతురు ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఐతయ్య, కమల దంపతులు నివాసం ఉంటున్నారు.
ఈ దంపతులకు గతంలో వివాహం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఇక్కడే పని చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఐతయ్య భార్య కమల నిండు గర్బిణీ. ఇటీవల కమలకు పురిటినొప్పులు రావడంతో భర్త ఐతయ్య వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే కమలకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వైద్యులు కమలకు వెంటనే ఆపరేషన్ చేశారు. కానీ ఫలితం లేకపోవంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ మరణించింది. అనంతరం వైద్యులు ఆ బిడ్డను బయటకు తీశారు. ఎన్నో ఆశలతో పుట్టిన బిడ్డను చూసుకుందామని ఆశపడితే ఆ దంపతులు తీవ్ర నిరాశే మిగిలింది.
ఇక కడుపులోనే బిడ్డ మరణించడంతో భర్త ఐతయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఐతయ్యకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అదే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఐతయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కమల బిడ్డ, భర్త మరణాన్ని తట్టుకోలేక అదే ఆస్పత్రిలోనే కన్నుమూసింది. వైద్యుల కళ్లముందే కుటుంబంలోని ముగ్గురు మరణించడంతో తీవ్ర విషాదంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.